Minister of State for Panchayat Raj and Rural Development of Telangana MLA Errabelli Dayakar Rao, GWMC Elections,
మొత్తం డివిజన్లలో విజయం మనదే
వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం
రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వరంగల్ తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులతో హన్మకొండలోని పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం సమావేశం అయ్యారు.
ఈ వరంగల్ మహా నగర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం డివిజన్లలో గెలిచి తీరాలని నిర్ణయించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 24 డివిజన్లలో పార్టీ నిర్ణయించిన గెలిచే అభ్యర్థుల విజయానికి అంతా కలిసికట్టుగా పని చేయాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను, ఇటీవల వరంగల్ నగరంలో మంత్రి కేటీఆర్ 25 వేల కోట్ల అభివృద్ధి పనులకు చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. అలాగే, బీజేపీ అబద్ధపు ప్రచారాలు చేస్తూ, మోసం చేస్తున్న వైనాన్ని ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. ప్రజలకు మేలు చేయగల్గింది ఒక్క టీఆరెఎస్ పార్టీ మాత్రమేనని ప్రజలకు చెప్పాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో మంత్రితో పాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ లు కడియం శ్రీహరి, బస్వరాజ్ సారయ్య, ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, మాజీ ఎంపీ గుండు సుధారాణి, మాజీ మేయర్ గుండా ప్రకాశ్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మెట్టు శ్రీనివాస్, ఒద్దిరాజు రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.