Minister Srinivas Goud presenting the Panchaloha Photo of the CM KCR Couple, Minister KTR, Telangana News, Telugu World Now,
TELANGANA NEWS: సీఎం కెసీఆర్ దంపతుల పంచలోహ చిత్రపటంను బహూకరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దంపతుల పంచలోహ చిత్ర పటంను రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ KT రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు, తన కుమార్తెలు శ్రీ శాంత నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్ పర్సన్ శ్రీహిత, శ్రీ హర్షిత లు మర్యాద పూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, ఈ చిత్ర పటం ను బహుకరించారు.
ఈ చిత్రపటం ను రాష్ట్ర మంత్రి వర్యులు, TRS పార్టీ కార్యనిర్వహక అధ్యక్షులు శ్రీ KTR గారి జన్మదినం ను పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేక చొరవతో తెలంగాణ కు చెందిన ఇద్దరు ప్రముఖ శిల్పులు 3 నెలల పాటు నిర్విరామంగా కృషి చేసి ఈ అద్భుతమైన పంచలోహ చిత్ర పటం ను 6X5 కొలతలతో రూపొందించారు.
పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ KTR గారు తన పుట్టినరోజు సందర్భంగా పేద ప్రజలకు మద్దతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాలనే సూచనల మేరకు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లో ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం తో పాటు రక్త దానం, దివ్వాoగులకు త్రిచక్ర సైకిల్స్ ను పంపిణీ చేయడం జరిగింది. KTR గారి పుట్టినరోజు ను పురస్కరించుకుని రూపొందించిన అపురూప కానుకను రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ KTR గారికి మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు నేడు తన కుమార్తె లతో కలసి ప్రగతి భవన్ లో అందించటం జరిగింది.