….మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ….
తెలంగాణ బడ్జెట్ దేశం గర్వపడే విధంగా ఉంది.
అభివృద్ధి , సంక్షేమం సమ పాళ్ళలో ఉంది.
వ్యవసాయం, అనుబంధ విభాగాలకు బడ్జెట్ లో పెద్ద పీట లభించింది.
పాడిపరిశ్రమ మీద 12 లక్షల కుటుంబాలు ఆధార పడి ఉన్నాయి.
పాడి పరిశ్రమ కు బడ్జెట్ లో ప్రాధాన్యత లభించింది.
ఒకపుడు 30 కోట్ల రూపాయల నష్టాల్లో ఉన్న విజయ డైరీ ఇపుడు 60 కోట్ల రూపాయల లాభం లో ఉందంటే అది సీఎం కెసిఆర్ విధానాల ఫలితమే.
వివిధ డైరీల టర్న్ ఓవర్ 600 కోట్ల రూపాయలకు చేరింది.
పాడి రైతులకు గతంలో ప్రకటించిన ప్రోత్సాహకాన్ని 39 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నాం.
లీటర్ కు నాలుగు రూపాయల ప్రోత్సాహకాన్ని రైతులకు ప్రకటించిన దాంట్లో ఒక్క రూపాయి చొప్పున భరించేందుకు డైరీ లు ముందుకు రావడం అభినందనీయం.
డైరీల్లో 2 లక్షల 15 వేల మంది సభ్యులు ఉన్నారు,
వారందరీ సంక్షేమమే మా ప్రాధాన్యం.
విజయ డైరీ ప్రైవేట్ కంపెనీ లతో పొటీ పడేలా మార్కెటింగ్ సదుపాయాలు పెంచుతున్నాం.
కొత్త ఐస్ క్రీం ఉత్పత్తులు విజయ బ్రాండ్ పేరిట విడుదల చేశాం.
విజయ ఔట్ లెట్ల సంఖ్యను వెయ్యికి పెంచుతున్నాం.
గొర్రెల పంపీణీ కి బడ్జెట్ లో నిధులు కేటాయించాము.
బర్రెలను సబ్సిడీ రేట్ల పై పంపిణీ చేసేందుకు ప్రాధాన్యత నిస్తున్నాం.
గ్రామీణాభివృద్ధికి, కుల వృత్తులకు చేయూత నిచ్చేందుకు చారిత్రాత్మక బడ్జెట్ అవకాశం కల్పించింది.
కళ్లుండి చూడలేని విపక్షాలు బడ్జెట్ ను విమర్శిస్తున్నాయి.
కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తున్నా కొందరికి కనిపించడం లేదు.
విజయ ఔట్ లెట్లతో లక్షలాది మందికి ఉపాధి దొరుకు తుంది.
సీఎం కెసిఆర్ దార్శనికత వల్లే పాడి, పశుసంవర్ధక శాఖలకు పునరుత్తేజం వచ్చింది.
యాదాద్రి పుణ్య క్షేత్రం ప్రపంచం ఆశ్చర్యపడేలా రూపుదిద్దుకుంటుంది ..
3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తాం.
గొర్రెల పంపిణీ లో అవక తవకలు అరికట్టేందుకు కట్టుదిట్టమైన విధానాన్ని రూపొందిస్తున్నాం
గొర్రెల పెంపకం దారులకు గడ్డి విత్తనాలు ఉచితంగా అందిస్తున్నాం.
నాణ్యమైన చేపలను మా శాఖ నుంచి అందించేందుకు 150 సంచార వాహనాలు ఏర్పాటు చేస్తున్నాం.
రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను టీ ఆర్ ఎస్ గెలవబోతుంది No Doubt,
ప్రభుత్వ పని తీరుకు ప్రజల ఆదరణ లభిస్తోంది.
విద్యావంతులు ఓటర్లు గా ఉన్న ఎన్నికల్లో చెల్లని ఓట్లు భారీ గా నమోదు కావడం విచారకరం.
ఉద్యోగాల భర్తీ పై ప్రతి పక్షాలు గాలి కబుర్లు చెబుతున్నాయి.
తాము అధికారం లో ఉండగా ఉద్యోగాలు ఇవ్వలేని వాళ్ళు కూడా ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు.
పాడి పరిశ్రమ మూత పడే స్థాయి నుంచి లాభాల బాటకు వెళ్లిందంటే అది సీఎం కెసిఆర్ విధానాల ఫలితమే.