Minister V Srinivas Goud, Ramappa Temple, UNESCO, Department of Language & Culture, Government of Telangana, MLC Pochampally Srinivas Reddy, Telugu World Now,
Telangana News: తెలంగాణ చారిత్రక సంపద రామప్ప దేవాలయంకు ప్రపంచ వారసత్వ సంపద గా “యునెస్కో” గుర్తింపు: మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్.
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు రవీంద్ర భారతీ లోని తన కార్యాలయంలో రామప్ప దేవాలయం కు యునేస్కో గుర్తింపు రావడం పై పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ఇది తెలంగాణ చరిత్రలో నిలిచిపోయో రోజు గా అభివర్ణించారు. తెలంగాణ చారిత్రక సంపద రామప్ప దేవాలయం కు ప్రపంచ వారసత్వ సంపద గా యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమన్నారు. అందుకు కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ. కెటిఆర్ గార్ల కృషి పలితంగా ఈ రోజు రామప్ప కు, తెలంగాణ కు గుర్తింపు లభించిందన్నారు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు.
తెలంగాణ వారసత్వ, చారిత్రక, సాంస్కృతి, సాంప్రదాయాలకు పూర్వ వైభవాన్ని తీసుకవస్తున్న ఘనత సిఎం కెసిఆర్ గారిదన్నారు. తెలంగాణ మహనీయలను, సాహితివేత్తలను, చరిత్రకారులను, సామాజిక వేత్తలను, కవులను, కళలను, కళకారులను గౌరవించి వారి జయంతి, వర్థంతి లను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు. ఉమ్మడి రాష్ట్రంలో గత 70 ఎళ్లు గా తెలంగాణ లోని కళలు, చరిత్ర, సంస్కృతి , సాంప్రదాయాలను నిర్లక్ష్యం చేసారన్నారు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు.
అద్భుతమైన శిల్పకళాఖండం రామప్ప దేవాలయం గా మంత్రి అభివర్ణించారు. రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ స్థాయి గుర్తింపు రావడం మనందరికీ గర్వకారణమన్నారు. కాకతీయుల ఘనచరిత్ర కు శిల్ఫాకళా నైపుణ్యానికి, కళలకు, సాంకేతిక నైపుణ్యానికి నిదర్శనం ఈ రామప్ప దేవాలయమన్నారు. రామప్ప దేవాలయానికి ఎప్పుడో యునెస్కో గుర్తింపు రావాల్సిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరగని ఎన్నో అద్భుతాలు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్నారు. త్వరలోనే తెలంగాణ అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా మారబోతోందన్నారు. ప్రపంచ పర్యాటకులు ఈ దేవాలయం ను సందర్శించడం వల్ల ఆ స్థాయిలో హోటల్ పరిశ్రమ, ట్రావిలింగ్, గైడింగ్ మొదలగు రంగాల్లో రాష్ట్రం లో యువతకు ఎన్నో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాజ్ మహాల్ ప్రపంచ వారసత్వ సంపద గుర్తింపు మూలంగా ఆగ్రా పట్టణము పూర్తి గా పర్యాటక రంగం పై ఆదారపడిందన్నారు మంత్రి శీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు. అంతే గాకుండా ఐరోపాలోని కోన్ని దేశాలు ఇటలీ, ప్రాన్స్, ఈజిప్టు, స్పేయిన్ మరియు రోమ్ , పారిస్, లాంటి పట్టణాలు టూరిజం పై ఆదారపడివున్నాయన్నారు.
ప్రపంచమే అబ్బుర పడే ఎన్నో గొప్ప కట్టడాలు తెలంగాణ లో ఉన్నాయన్నారు. ముత్యాల ధర, వెయ్యి స్థంభాల గుడి, గోల్కొండ కోట, చార్మినార్, కుతుబ్ షాహి టూంబ్స్, పిల్లల మర్రి లాంటి అనేక చారిత్రక కట్టడాలు, ప్రదేశాలు ఉన్నాయన్నారు.
మంత్రి కేటీఆర్ నేతృత్వంలో దుర్గం చెరువు పై కేబుల్ బ్రిడ్జ్ హైదరాబాద్ కే తలమానికమన్నారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడంలో కృషి చేసిన సహాచర మంత్రులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్, కాకతీయ హెరిటేడ్ ట్రస్ట్ సభ్యులు శ్రీ పాపారావు, పాండురంగారావు, ఎం పి లు బండా ప్రకాష్, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రామప్ప కు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు విశేష కృషి చేసిన రష్యా, నార్వే తదితర దేశాల దౌత్యవేత్తలకు, కేంద్రపభుత్వానికి, కేంద్ర పురావస్తు శాఖ ఉన్నతాదికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.. మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు శ్రీమతి మాలోత్ కవిత, పసునూరి దయాకర్, ఎం ఎల్ సి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ కె యస్ శ్రీనివాస రాజు, పురావస్తు శాఖ ఉప సంచాలకులు నారాయణ, రాములు నాయక్, మాధవి, రాజు, సిబ్బంది పాల్గోన్నారు.