Minister V. Srinivas Goud, Telangana Old Age Artists Pension, CM KCR, Mamidi Harikrishna, Telangana Poltical News,
వృద్ధ కళాకారులకు సీఎం కెసిఆర్ వరం – వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 రూపాయల నుండి 3016 రూపాయల వరకు పెంపుదల.
తెలంగాణ రాష్ట్రం లో వృద్ధ కళాకారులకు 1500 వందల రూపాయల నుండి రూపాయలు 3016 కు వృధ్యాప్య పెన్షన్లు ను పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో సాంస్కృతిక శాఖ పై మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ…
పెంచిన వృద్ధ కళాకారుల పెన్షన్లు ను తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2 – 2021 నుండి కళాకారులకు వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పెంచిన వృధ్యాప్య పెన్షన్లు వల్ల 2661 మంది వృద్ధకళాకారులకు ప్రయోజనం కలుగుతుందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు కళా ప్రియుడు, సాహితీవేత్త, కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు కావడం వల్ల వృద్ధ కళాకారుల పెన్షన్ ను 1500 రూపాయల నుండి 3016 రూపాయల (రెట్టింపు పెన్షన్) ను పెంచి కళాకారుల వికాసం కోసం కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
• తెలంగాణ కళలకు కాణాచి. సకల కళల ఖజానా గా అభివర్ణించారు. ఎంతో మంది జానపద, గ్రామీణ గిరిజన కళాకారులకు కొలువైన నేల మన తెలంగాణ అని వెల్లడించారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
• ఉమ్మడి రాష్ట్ర పాలనలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, సాహిత్యం, భాష వంటివి నిర్లక్ష్యం కు గురైనాయన్నారు. రాష్ట్ర అవతరణ అనంతరం వీటి అభివృద్ధి కోసం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ఎన్నెన్నో సాంస్కృతిక, సాహిత్య, కళాకార్యక్రమాలను రూపొందించి నిర్వహిస్తూ కళాకారులలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నామన్నారు. జానపద జాతర, రాష్ట్ర అవతరణ వేడుకలు వంటి ఉత్సవాల ద్వారా వేలాదిమంది కళాకారులకు కళాప్రదర్శనలకు అవకాశమిస్తూ కళాకారులలో కొత్త ఉత్సాహాన్ని తీసుకురావడం జరిగింది.
• జీవితాంతం కళాప్రదర్శనలోనే గడిపి, తమ జీవితాన్ని అంకితం చేసి, వృద్ధులు అయిన తర్వాత వారి సంక్షేమం కోసం వృద్ధ కళాకారుల పెన్షన్ ను ప్రభుత్వం అందిస్తున్నదన్నారు.
• తెలంగాణ ఏర్పడక ముందు ఈ పెన్షన్ మొత్తం కేవలం రూ. 500/- వందలు మాత్రమే ఉండేదన్నారు.
• తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే గౌరవ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుగారు కళాకారుల పెన్షన్ ను 500 నుండి 1500 రూపాయలకు పెంచామన్నారు. 2014 అక్టోబర్ నెల నుండి రాష్ట్రంలోని వృద్ధ కళాకారులకు అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీ V శ్రీనివాస్ గౌడ్. మొత్తంగా 2661 మంది వృద్ధ కళాకారులకు నెలకు 39.90 లక్షల చొప్పున సంవత్సరానికి 4 కోట్ల 78 లక్షల 80 వేల రూపాయలను అందిస్తున్నామన్నారు.
• గౌరవ ముఖ్యమంత్రి కళాప్రియుడు. సాహితీవేత్త. కళాకారులంటే ఎంతో గౌరవం ఉన్న నాయకుడు. అందుకే వృద్ధ కళాకారుల పెన్షన్ మళ్లీ రూ. 3016/- కు అంటే రెట్టింపు పెంచాలని నిర్ణయించారన్నారు.
• వృద్ధ కళాకారుల పెన్షన్ పెంచడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 2661 మంది లబ్ది పొందుతారు. ప్రభుత్వం వీరి కోసం నెలకు 80 లక్షల చొప్పున సంవత్సరానికి 9 కోట్ల 62 లక్షల 71 వేలను ఖర్చు చేస్తుందన్నారు.
• ఈ పెంచిన పెన్షన్ మొత్తం రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2, 2021 నుండి అమలులోకి వస్తుందన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
• ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కళాకారుల కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి అనే వ్యవస్థను ఏర్పాటుచేసి 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీని కోసం ప్రతి సంవత్సరం 16 కోట్ల 17 లక్షల రూపాయలను కేటాయించడం జరిగిందన్నారు. భారతదేశంలోనే ఇలా కళాకారులకు ఉద్యోగాలిచ్చి గౌరవించుకుంటున్న ఒకే ఒక్క రాష్ట్రం మన తెలంగాణ దన్నారు.
• గౌరవ హైకోర్టు ఆదేశాలననుసరించి తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ఎంపిక కోసం ఒక ప్రత్యేక నిపుణుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి సారథ్యంలో అర్హులైన కళాకారులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఇటీవలే ఫలితాలను కూడా కమిటీ వెల్లడించిందన్నారు.
• సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ ఖ్యాతిని, కీర్తిని దశదిశలా చాటిన వైతాళికులను వారి జయంతులు, వర్ధంతులను అత్యంత వైభవంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ద్వారా నిర్వహించుకుంటున్నామన్నారు. దాని ద్వారా ఆ మహనీయులకు నివాళి అర్పించడమే కాక వారి స్ఫూర్తిని భావితరాలకు అందిస్తున్నామన్నారు.
• తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఉన్న బతుకమ్మ, బోనాలు పండుగలను, సమ్మక్కసారక్క, ఏడుపాయల, నాగోబా, కురుమూర్తి వంటి జాతరలను ఘనంగా నిర్వహించుకుంటూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చాటి చెబుతున్నామన్నారు మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు.
ఈ సమీక్ష సమావేశం లో తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ KS శ్రీనివాస రాజు, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ మామిడి హరికృష్ణ లు పాల్గొన్నారు.