నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‌లో రూపొందిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై మహేష్ బాబు.పి దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ నెల 7వ తేదీన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మీడియాతో క్యూ అండ్ ఏ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ఫ్రెండ్స్ తో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టికెట్ బుకింగ్స్ అనౌన్స్ మెంట్ చేయించారు.
హీరో నవీన్ పోలిశెట్టి మాట్లాడుతూ… ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఆ ట్రైలర్ ను ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న తీరు చూస్తుంటే మాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. మేము సినిమాలో చెప్పబోతున్న పాయింట్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనిపించింది. కృష్ణాష్టమి రోజు మా మూవీ రిలీజ్ అవుతుంది, కృష్ణుడు ఎలా అల్లరి చేస్తాడో, ఈ సినిమా కూడా అంతే అల్లరిగా ఉంటుంది. రీసెంట్ గా నేను మా సినిమా ప్రమోషన్ కోసం చేసిన స్టాండప్ టూర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి, కరీంనగర్, వరంగల్ ఇలా అన్ని చోట్ల ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అయ్యాను. వారు మా సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 6న తేదీ నుంచి యూఎస్ టూర్ కు వెళ్తున్నాం. అక్కడి వివిధ స్టేట్స్ లో ప్రేక్షకుల్ని కలవబోతున్నా.