Mla Boinapally Vinod Kumar, Olympics, Telangana News, Telugu World Now,
2033 లో ఒలింపిక్స్ కు ఇండియా బిడ్ చేయక తప్పదు: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
*రాష్ట్ర క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంచుకోవాలి*
*రాష్ట్రంలో మరిన్ని సింథటిక్ ట్రాక్స్ ఏర్పాటు*
*రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్*
వచ్చే 2033 సంవత్సరంలో జరగబోయే ఒలింపిక్స్ లో ఇండియా బిడ్ చేయక తప్పదు అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
ఆదివారం వరంగల్ లో స్పోర్ట్స్ స్టేడియంలో సింథటిక్ ట్రాక్ లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ ఇండియాలో ఒలింపిక్స్ ను నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని కేంద్రానికి సూచించారు.
అంతలోపు దేశంలో, ముఖ్యంగా రాష్ట్రంలోని క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలని ఆయన సూచించారు.
దేశంలో హైదరాబాద్, ఢిల్లీ, చెన్నై, ముంబయి, బెంగళూరులలో క్రీడా ప్రాంగణాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు.
ఒలింపిక్స్ నిర్వహణ స్థాయి ఇండియాకు ఉందన్నారు. అదే సమయంలో క్రీడాకారులు కూడా ఒలింపిక్స్ స్థాయిలో రాణించేందుకు కృషి చేయాలని వినోద్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో ఇప్పటికే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, మహబూబ్ నగర్ లలో సింథటిక్ ట్రాక్స్ ఉన్నాయని, రానున్న రోజుల్లో మరిన్ని జిల్లాల్లో సింథటిక్ ట్రాక్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.