Political తెలంగాణ ప్రభుత్వ ఇంటిలిజెంట్ అధికారులు తన భద్రత కోసం ఏర్పాటుచేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం తరచూ మరమ్మతులకు గురై ఇబ్బంది పెడుతుంది అంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసహనం వ్యక్తం చేశారు ఈ విషయంపై తాజాగా తెలంగాణ ఇంటిలిజెంట్ ఐజికి లేఖ రాశారు..
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్.. తన భద్రత కోసం తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు ఏర్పాటు చేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం ప్రతిసారి మరమ్మతులు గురవుతూనే ఉందంటూ చెప్పుకొచ్చారు.. ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు అసహనం వ్యక్తం చేసిన ఈయన తాజాగా తెలంగాణ ఇంటిలిజెన్స్ ఐజి కి లేఖ రాశారు. తాను ఎక్కడికి వెళ్లినా ఆ వాహనంలోనే వెళ్లాల్సి వస్తుందని అయితే నియోజకవర్గంలో పర్యటిస్తున్న ప్రతిసారి అకస్మాత్తుగా ఆగిపోవడం చాలా ఇబ్బందికరంగా మారిందని తెలిపారు అయితే ఇప్పటికే చాలాసార్లు ఈ విషయాన్ని తెలంగాణ పోలీసు శాఖ దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ వారు పెద్దగా పట్టించుకోవడంలేదని ఎన్నిసార్లు చెప్పినా తనకు మళ్ళీ మళ్ళీ అదే వాహనాన్ని కేటాయిస్తున్నారని చెప్పుకొచ్చారు.. అయితే దీన్ని మార్చి కండిషన్ లో ఉన్న వాహనాన్ని తనకు ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని తెలిపారు.. ఇటీవల కొంతమంది ఎమ్మెల్యేలకు నూతన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు కేటాయించారని.. ఆ జాబితాలో నా పేరు లేకపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణలో కండిషన్ లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వకపోవడం దారుణం అన్నారు.