Political ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు వినిపించిన దగ్గర నుంచి ఈ విషయం మరింత వైరల్ గా మారింది దీనిపై ఇప్పటికే పలు పరిణామాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో కవిత తాజాగా సిబిఐ కి రాసిన లేకపై అధికారులు నుంచి రిప్లై వచ్చిందని సమాచారం..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐకి రాసి లేఖపై అధికారుల నుంచి రిప్లై వచ్చింది. ఇందులో ఈనెల 11న విషయాలను అందుబాటులో ఉండాలని సిబిఐ కవితకు తెలిపినట్టు సమాచారం.. ఈ-మెయిల్ ద్వారా సిబిఐ కవితకు సమాచారం అందించారని ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణ నిర్వహిస్తామని ఆ సమయానికి కచ్చితంగా హాజరు కావాల్సిందిగా ఆమెకు సూచించినట్టు తెలుస్తోంది..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడి రిమాండ్ రిపోర్టర్లు ఎమ్మెల్సీ కవిత పేరును చేర్చిన తర్వాత ఆమెకు సిబిఐ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే అయితే ఈ నెల 6వ తేదీన విచారణకు సిద్ధమని తెలిపిన కవిత ఆ తర్వాత ఫిర్యాదు ఒరిజినల్ కాపీ ఎఫ్ఐఆర్ కాపీలను అందించాలంటే సిబిఐ ఆమె కోరారు.. కానీ దానికి సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లభించలేదు. ఈ క్రమంలో కవిత జగిత్యాల పర్యటన కారణంగా విచారణకు హాజరుకాలేనని సీబీఐకి లేఖ రాశారు. 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటానని ఆ లేఖలో ప్రస్తావించారు. తర్వత ఆమెను 11వ తారీఖున విచారణకు హాజరు కావాల్సిందిగా సిపిఐ కోరింది..