Politics భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ప్రధాని నరేంద్ర మోడీని కలవనున్నట్టు తెలుస్తోంది అయితే ఎంపీ హోదాలో ఉండి ప్రధానిని కలవడం ఉన్నారా లేక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది..
తాజాగా తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో పలుచలికలు ఏర్పడ్డాయి.. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కి ప్రస్తుతం పార్టీ వేసిన కమిటీల్లో చోటు దక్కలేదు. దీంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ తన అసహనాన్ని వ్యక్తం చేశారు.. అలాగే సమయం వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతానని.. ఇంకా కేంద్ర కమిటీలు వేసే అవకాశం ఉందని.. వాటిలో తనకు ఛాన్స్ వచ్చే సూచనలు ఉన్నాయని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు. వర్గాలుగా విడిపోయి అంతర్గత పోరు రోజురోజుకీ పెరిగిపోతుంది. సీనియర్ నేతలు అందరూ బయటకు వచ్చి తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి ప్రధాన నరేంద్ర మోడీని కలవనున్నారు అనే విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది దీనిపై ఇప్పటికే పలు కారణాలు వెలబడుతుండగా అసలు విషయం ఏమిటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది సాధారణంగా ప్రధాని ఎంపీ హోదాలో ఉన్న వారిని కలవడం సాధారణమే అయితే ఈయన ఇందుకే కలవనున్నారా లేక పార్టీ మారనున్నారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది..అయితే ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చీలికలతో విసిగిపోయిన కోమటిరెడ్డి తాజాగా బిజెపిలోకి మారనున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి