రాష్ట్రంలో నల్లమల్ల అభయారణ్యంలో వృక్ష, జంతుజాలం సమతుల్యతను కాపాడుకోవడానికి తెలంగాణ అటవీశాఖ అధికారులు కృషిని అభినందిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. నల్లమల్లలో జంతువులు, వృక్షాల చిత్రాలను ట్వీటర్ వేదికగా ఆయన పంచుకున్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఆయన హరితహారం అభినందనలు తెలిపారు. వర్షాకాలంలో నల్లమల్ల అడవులు అద్భుతంగా కనువిందు చేస్తున్నాయన్నారు. నల్లమల్ల ప్రాంతంలోని వృక్షజాలం, జంతుజాలం సమతుల్యతను కాపాడుకో వడానికి అటవీ శాఖ చేస్తున్న కృషి, అద్భుతమైన అటవీ శ్రేణులు ఉన్నందుకు మనం గర్వపడాలన్నారు.