యాక్టర్ పృథ్వీ అంబర్ అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీ ‘చౌకీదార్’ షూటింగ్ ప్రారంభమైంది. బెంగళూరులోని బండే మహంకాళి ఆలయంలో ముహూర్తపు వేడుక ఘనంగా జరిగింది. నిర్మాత కల్లహళ్లి చంద్రశేఖర్ క్లాప్ కొట్టి వేడుకను ప్రారంభించగా, సాయికుమార్ కెమెరా స్విచాన్ చేశారు. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహిస్తున్న ‘చౌకీదార్’ చిత్రంలో ‘డైలాగ్ కింగ్’గా పేరుగాంచిన సాయికుమార్ ప్రధాన పాత్రలో నటించగా, ధన్యారామ్ కుమార్ ఫిమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. ముహూర్తాన్ని పురస్కరించుకుని చిత్రబృందం చిత్ర విశేషాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.
దర్శకుడు చంద్రశేఖర్ బండియప్ప మాట్లాడుతూ.. ‘‘మల్టీ లాంగ్వేజస్ లో విడుదలవుతున్న నా ఆరో చిత్రమిది. కల్లహళ్లి చంద్రశేఖర్ ఈ చిత్రానికి నిర్మాత. రథావర విజయం తర్వాత మరో చిత్రానికి దర్శకత్వం వహించాలని నన్ను సంప్రదించారు. పృథ్వీ లవర్ బాయ్‌గా నటించారు. ఈ సారి వేరే కథ చెప్పాలనుకున్నాను. ఆయన అంగీకరించారు. ఆయన ఆ పాత్ర కోసం ఇంటెన్స్ గా ప్రీపేర్ అవుతున్నారు. మేడమ్, సాయికుమార్ సార్, ధర్మా సార్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సచిన్ బస్రూర్ సంగీతాన్ని సమకూర్చారు’ అన్నారు.
యాక్టర్ పృథ్వీ అంబర్ మాట్లాడుతూ… “చౌకీదార్ సినిమా మా అమ్మ ఆశీస్సులతో ప్రారంభమైంది. కథ విన్నప్పుడు, ఈ పాత్ర కోసం నేను చాలా కష్టపడాలని నాకు తెలుసు, సిద్ధం కావడానికి సమయం అడిగాను. అక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాం. ఒక్కరోజులో టీజర్‌ని చిత్రీకరించాం, చాలా ఫన్ గా అనిపించింది. నటులు ధర్మా సార్, సాయికుమార్ సర్‌లతో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది. ఈ చిత్రంలో చాలా జీవిత అనుభవాలు వున్నాయి. యూనిక్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ ని బ్లెండ్ చేసిన ఈ చిత్రం చౌకీదార్ టైటిల్ ఎసెన్స్ ని క్యాప్చర్ చేస్తుంది” అన్నారు.
సాయికుమార్ మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది. వచ్చే ఏడాది నటుడిగా 50 ఏళ్లు పూర్తవుతాయి. నాన్నకు, అమ్మకు కృతజ్ఞతలు. కన్నడ సినిమాల్లో నటించాలని మా అమ్మ ఎప్పుడూ చెబుతుంటారు. నా కన్నడ ప్రయాణం కూడా 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పదిహేను సినిమాలు జరుగుతున్నాయి. ప్రతిది సవాల్ తో కూడుకున్న పాత్రే”. చౌకీదార్ కథ ఎమోషనల్ డ్రామా. పృథ్వీ హీరోగా వచ్చిన తుళు సినిమాలో నేను కూడా నటించాను. ఇది చాలా మంచి సబ్జెక్ట్’ అన్నారు.
నటి ధన్య రామ్‌కుమార్ మాట్లాడుతూ.. ‘చౌకీదార్ నటించే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.
విద్యాశేఖర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్లహళ్లి చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ‘చౌకీదార్’. నాగేంద్రప్రసాద్, ప్రమోద్ మరవంటే సాహిత్యం అందించిన ఈ చిత్రానికి సచిన్ బస్రూరు సంగీతం అందిస్తున్నారు. ‘చౌకీదార్’ పలు భాషల్లో రూపొందుతోంది. ఇప్పటివరకు తన లవర్ బాయ్ పాత్రలకు పాపులరైన పృథ్వీ అంబర్ ఇప్పుడు ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుకానున్నారు, ఇది ట్రూ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్