Naga Shaurya’s ‘LAKSHYA’ Climax Shoot Begins, Ketika Sharma, Jagapathi Babu, Dheerendra Santhossh Jagarlapudi, Entertainment News, Telugu World Now,
Entertainment News: క్లైమాక్స్ షూటింగ్‌లో నాగశౌర్య “లక్ష్య”
టాలెంటెడ్ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ప్రాచీన విలువిద్య నేపథ్యంలో
రూపొందుతోన్న నాగశౌర్య 20వ చిత్రం ‘లక్ష్య’. ఈ మూవీలో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్తలుక్‌లో కనిపించనున్నారు నాగశౌర్య.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నాగశౌర్య సరసన కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో కీలక పాత్రలలో విలక్షణ నటులు జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ నటిస్తున్నారు.
ఈ చిత్రంలోని కీలకమైన క్లైమాక్స్ సీక్వెన్స్ ను ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. నాగశౌర్యతో పాటు, జగపతి బాబు ఇతరనటులు ఈ షూట్ లో పాల్గొంటున్నారు. ప్రేక్షకుల మనసు గెలుచుకునే విధంగా ఈ క్లైమాక్స్ ఎపిసోడ్‌ని లావీష్‌గా తెరకెక్కిస్తున్నారు మేకర్స్.
ఈ సందర్భంగా విడుదలచేసిన మేకింగ్ వీడియోలో నాగశౌర్య తన లక్ష్యాన్నిఛేదించడానికి సిద్దమవడం మనం చూడొచ్చు. నిజానికి విలువిద్యకు తీక్షణమైన దృష్టి, క్రమశిక్షణ మరియు అగ్రశ్రేణి ఏకాగ్రత అవసరం.
నాగశౌర్య బర్త్‌డే సందర్భంగా రిలీజైన టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా ఇతర ప్రమోషనల్ కంటెంట్‌మీద అంఛనాలు పెరిగాయి.
తారాగణం: నాగశౌర్య, కేతికశర్మ, జగపతి బాబు,సచిన్ ఖేడేకర్
సాంకేతిక వర్గం:
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ జాగర్లపూడి
నిర్మాతలు: నారయణదాస్ కె. నారంగ్, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్ మరార్
సినిమాటోగ్రాఫర్: రామ్‌రెడ్డి
సంగీతం: కాలబైరవ
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
డైలాగ్స్: సృజనమణి
పిఆర్ఓ: బి.ఎ.రాజు, వంశీ -శేఖర్.