మూమూలుగానే ఒక నటుడికి వందో సినిమా అంటే ఆషామాషీ కాదు. ప్రముఖ నటుడు వందో సినిమా అంటే ఆయన అభిమానుల ఆనందానికి అంతే ఉండదు. ఇప్పుడు ఇలాంటి గుడ్‌న్యూసే చెప్పారు హీరో అక్కినేని నాగార్జున. 100వ సినిమా కోసం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
తన వందో సినిమా కోసం గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నామని.. దీనిపై చర్చలు కూడా జరిపినట్లు నాగార్జున తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఇద్దరు దర్శకులు, ఓ నిర్మాతతో డిస్కస్ చేసినట్లు చెప్పారు. ‘‘నా వందో సినిమా ఒక విజువల్ వండర్‌లా ఉండాలి. అది ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయాలి. అలా అని ఎక్కువ గ్రాఫిక్స్ ఉండాలన్న నిబంధన లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలను సినిమా హాలుకు రప్పించడం అన్నింటికంటే గొప్ప విషయం’’ అని నాగార్జున అన్నారు.