నటసింహా నందమూరి బాలకృష్ణ, గోపిచంద్ మలినేనిల ఫస్ట్ క్రేజీ కాంబినేషన్‌లో పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్యను ఇంత వరకు చూడని సరికొత్త రూపంలో చూపించనున్నాడు దర్శకుడు గోపిచంద్ మలినేని. ఈ మూవీ ఇటీవలే సెట్స్ మీదకు వెళ్లింది.
తాజాగా ఈ సినిమాలో బాలకృష్ణ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుతో పాటు రగ్డ్ లుక్‌లో మెడపై రుద్రాక్ష మాలతో బాలకృష్ణ స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్నారు, ఈ పోస్టర్‌లో నల్ల చొక్కా మరియు గోధుమ రంగు పంచె ధరించాడు. క్యారెక్టర్‌కు మరింత ఎలివేషన్ ఇచ్చే వాచ్, ఉంగరాలు, షేడ్స్ వంటి వాటిని కూడా పోస్టర్లో మనం చూడొచ్చు. మొత్తంమీద బాలకృష్ణ లుక్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.
బాలకృష్ణ 107వ చిత్రంగా పక్కా మాస్ అండ్ కమర్షియల్ అంశాలతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. నటీనటులు : నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్
సాంకేతిక బృందం : స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: గోపీచంద్ మలినేని, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం: తమన్ ఎస్, డీఓపీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్ : రామ్- లక్ష్మణ్, సీఈవో : చెర్రీ, కో డైరెక్టర్: కుర్రా రంగరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి,లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రహ్మణ్యం కేవీవీ, పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీఆర్వో : వంశీ-శేఖర్.