Nani’s Shyam Singha Roy Final Schedule In 6.5 Cr Worth Massive Set In Hyderabad, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Sankrityan,
ఆరున్నర కోట్లతో హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోన్న నాని “శ్యామ్ సింగరాయ్”
న్యాచురల్ స్టార్ నాని కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్ ఆడియన్స్‌లో సినిమా పట్ల మరింత ఆసక్తిని క్రియేట్ చేస్తూ అటు ఇండస్ట్రీలోనూ ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలను భారీగా పెంచేసింది.
తాజాగా ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్ల..కోల్‌కతాను తలపించే భారీ సెట్‌ను హైదరాబాద్‌లో రీ క్రియేట్ చేశారు. ఆరున్నర కోట్ల భారీ బడ్జెట్‌తో పది ఎకరాల్లో నిర్మించిన ఈ భారీ సెట్లో ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. హీరో నాని సహా ముఖ్యతారాగణంపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. రేపు థియేటర్‌లలో ఈ సన్నివేశాలు సినీ ప్రియులకి ఒక కొత్త అనుభూతిని పంచనున్నాయని చిత్ర యూనిట్ తెలిపింది.
దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ ఓ యూనిక్ కాన్సెప్ట్‌తో ‘శ్యామ్‌సింగ రాయ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తన గత చిత్రాలకు భిన్నమైన సరికొత్త గెటప్స్‌లలో నేచురల్ స్టార్ నాని కనిపించనున్నారు.
సాయిపల్లవి, కృతిశెట్టి, మడోనా సెబాస్టియన్ ముగ్గురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ నటిస్తోన్న ఈ చిత్రాన్ని
ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో ఎక్కడ రాజీ పడకుండా నిర్మాత వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ తో అసోసియేట్ అయిన ప్రతి ఒక్కరికీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఓ స్పెషల్ ఫిల్మ్‌గా ఉండబోతుంది.
జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
నిహారిక ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రానికి సత్యదేవ్ జంగా కథ అందించారు. మెలోడీ స్పెషలిస్ట్ మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ నవీన్ నూలి ఈ సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు:
నాని, సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్, జీస్సూసేన్ గుప్తా, రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమఠం తదితరులు
సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: రాహుల్ సంకృత్యాన్
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
ఒరిజినల్ స్టోరీ: సత్యదేవ్ జంగా
మ్యూజిక్ డైరెక్టర్ : మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: సను జాన్ వర్గీస్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ .వెంకటరత్నం (వెంకట్)
ఎడిటర్: నవీన్‌నూలి
పీఆర్ఒ:వంశీ –శేఖర్
Cast:
Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Jisshu Sengupta, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam
Technical Crew:
Director: Rahul Sankrityan
Producer: Venkat Boyanapalli
Banner: Niharika Entertainment
Original Story: Satyadev Janga
Music Director: Mickey J Meyer
Cinematography: Sanu John Varghese
Production Designer: Avinash Kolla
Executive Producer: S Venkata Rathnam (Venkat)
Editor: Naveen Nooli
PRO: Vamsi-Shekar