టాలీవుడ్ నటుడు నరేష్ కుటుంబంలోని వివాదం మరింత ఎక్కువైంది. గతకొంతకాలంగా నటి పవిత్రా లోకేష్‌తో నరేష్ సన్నిహితంగా ఉంటున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని మైసూర్‌లో ఓ హోటల్‌లో వాళ్లిద్దరూ ఉండగా నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి అక్కడికి వెళ్లారు. తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రా లోకేష్‌తో నరేష్ సన్నిహితంగా ఉంటున్నారని గత కొంతకాలంగా రమ్య రఘుపతి ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే మైసూర్‌లో వాళ్లు ఉంటున్న ప్రదేశానికి వెళ్లిన ఆమె.. పవిత్రా లోకేష్‌ను చెప్పుతో కొట్టబోయారు. చుట్టుపక్కల వారు అడ్డుకోవడంతో నరేష్, పవిత్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు నరేష్, పవిత్రా లోకేష్ పెళ్లి చేసుకోబోతున్నారంటూ గతకొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం.