NATA Donates Rs 5 Lakh to Telangana CM Relief Fund For Covid19,NRI News,USA Telugu News,
తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి నాటా రూ.5 లక్షల విరాళం…
కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి, రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు నాటా తన వంతు సహాయంగా తెలంగాణ ప్రభుత్వానికి రూ.5 లక్షల సహాయాన్ని ప్రకటించింది. ఈమేరకు రూ.5లక్షల సహాయాన్ని గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి జమచేసింది. గత ఏడాది కూడా కరోనా సమయంలో నాటా (నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్) రూ.10 లక్షల సహాయాన్ని అందించింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలని, ప్రభుత్వానికి సహాయం చేయాలని నాటా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ అమర్‌నాథ్ గుండా, సెక్రటరీ రామిరెడ్డి, ట్రెజరర్ నారాయణ రెడ్డిలు కోరారు. కరోనాను కల్సికట్టుగా ఎదుర్కొందామని, ప్రపంచ మానవాళి కరోనా నుంచి వీలైనంత త్వరగా విముక్తి కావాలని వారు ఆకాంక్షించారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రణాళిక సంఘం వైస్‌ఛైర్మన్ వినోద్ కుమార్‌ల సూచనలతో నాటా సీఎంఆర్ ఎఫ్‌కు తన వంతు సహాయాన్ని అందించిందని, తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందించడానికి నాటా ఎల్లపుడు సిద్దంగా ఉన్నదని వారు చెప్పారు.