విలక్షణ కథలతో తన మార్క్ చూపెడుతున్న యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రస్తుతం ‘భళా తందనాన’ అనే కమర్షియల్ ఎంటర్‌టైనర్ లో నటిస్తున్నారు. బాణం ఫేమ్ దంతులూరి చైతన్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కేథరిన్ థ్రెసా హీరోయిన్. నేడు న్యాచురల్ స్టార్ నాని ఈ మూవీ టీజర్ విడుదలచేశారు.
‘రాక్షసున్ని చంపడానికి దేవుడు కూడా అవతారాలెత్తాలి.. నేను మామూలు మనిషిని’ అంటూ శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొదలైంది. రాజకీయ నాయకులను ప్రశ్నిస్తూ ముగిసిన టీజర్ అందరినీ మెప్పించేలా ఉంది.
ఈ టీజర్ మొత్తంలో శ్రీవిష్ణు తన నటనతో అందరినీ మెప్పించారు. నటనలోని వేరియేషన్స్ చక్కగా చూపించారు. కేథరిన్ ఈ రోల్‌కు పర్ఫెక్ట్ అనిపించేలా నటించారు. శ్రీనివాస్ రెడ్డి కామెడీ, కేజీయఫ్ ఫేమ్ రామచంద్ర రాజు విలనిజం బాగా కుదిరాయి.
నటీనటులు : శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా, రామచంద్ర రాజు
సాంకేతిక బృందం : దర్శకుడు: చైతన్య దంతులూరి, నిర్మాత: రజనీ కొర్రపాటి, సమర్పణ: సాయి కొర్రపాటి, బ్యానర్: వారాహి చలన చిత్రం, సంగీతం: మణిశర్మ, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్, సినిమాటోగ్రఫర్: సురేష్ రగుతు,యాక్షన్ కొరియోగ్రఫర్: పీటర్ హెయిన్, ఆర్ట్ డైరెక్టర్: గాంధి నడికుడికర్, రచయిత : శ్రీకాంత్ విస్సా, పీఆర్ఓ : వంశీ-శేఖర్.