నయన్తార, విగ్నేష్ శివన్ దంపతులు షాకింగ్, గుడ్న్యూస్ చెప్పారు. ఈ జంటకు ఆదివారం రాత్రి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. స్వయంగా ఈ జంట తమ సామాజిక మాధ్యమాల్లో ఈ విషయాన్ని పంచుకున్నారు. మేము అమ్మా, నాన్నా.. అయ్యాం.. మాకు కవల మగ పిల్లలు పుట్టారు. వారికి మీ ఆశీస్సులు కావాలి.. అని రాసుకొచ్చారు. దీంతో పాటు ఈ దంపతులు చిన్నారుల కాళ్లను ముద్దాడుతున్న ఫోటోలను పంచుకున్నారు.
ఈ జంటకు పెళ్లి జరిగి నాలుగు నెలలే అవుతోంది. ఇంతలో పిల్లలు ఏంటని అందరూ ఆశ్చర్యానికి గురువుతున్నారు. నయన్ స్వయంగా ప్రెగ్నెంట్ కాకుండా సరోగసి పద్ధతిని ఆశ్రయించారు. అది కూడా పెళ్లికి ముందే పిల్లులు కనాలని నిర్ణయించుకున్నారు. అభిమానులతో పాటు నయన్, విగ్నేష్ ఇంట్లో కూడా గుడ్న్యూస్ ఇప్పుడే తెలిసింది.