Shaakuntalam : సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘శాకుంతలం’. దేవకన్య అయిన మేనకకి పుట్టిన ‘శకుంతల’ పాత్రలో సమంత కనిపించబోతుంది. మలయాళ నటుడు దేవ్ మోహన్ దుశ్యంత మహారాజు పాత్ర చేస్తున్నాడు. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, దిల్ రాజు నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ప్రిన్స్ ‘భారత’ పాత్రలో నటిస్తుంది. మోహన్ బాబు, మధూ, గౌతమి, అధితి బాలన్ మరియు అనన్య నాగళ్ల తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో పాటను వదులుతూ వస్తున్నారు. కాగా ఈ మూవీ నుంచి ‘మల్లికా మల్లికా’, ‘రుషివనంలోన’ సాంగ్స్ కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. ‘ఏలేలో ఏలేలో ఏలో యాలా .. ఏటీలోన సాగే నావా, ఏలేలో ఏలేలో ఏలో యాలా .. దూరాలేవో చేరే తోవా’ అంటూ ఈ పాట సాగుతోంది. శకుంతల తన భర్తను కలుసుకోవడానికి నావలో బయల్దేరి వెళుతున్న సందర్భంలో వచ్చే పాట ఇది. సందర్భానికి తగిన ట్యూన్ లో మణిశర్మ ఈ పాటను చేశారు. చైతన్య ప్రసాద్ సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.
ఈ నెల 17వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు సమంత విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కానుంది. మరోవైపు బాలీవుడ్ లోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తోంది సామ్. ‘సిటాడెల్’ సిరీస్ ఆధారంగా ఇండియన్ వెర్షన్ లో నిర్మిస్తున్న ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటిస్తుంది.