Movie News:ప్రస్తుత కాలంలో లేడీ ఓరియంటెడ్ కథలు అధికంగా తెరకెక్కించడం మంచి విషయంగా చెప్పుకోవాలి. ఇదే తరహాలో రెజీనా కసాండ్రా, నిధి నివేద థామస్ కీలకపాత్రలో పోషిస్తున్న చిత్రం “శాకిని డాకిని”. మొదట్లో ఈ టైటిల్ వినగానే హర్రర్ స్టోరీ అనుకున్నారు అభిమానులు. అయితే ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తరహాలో ప్రేక్షకులను అలరించేందుకు సర్వం సిద్ధం అవుతున్న విషయం అందరికీ అందరికీ తెలిసిందే.
అయితే ఈ చిత్రం దక్షిణ కొరియా చిత్రమైన మిడ్‌నైట్ రన్నర్ కి తెలుగు రీమేక్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుధీర్ వర్మ. నిర్మాతలుగా డి. సురేశ్ బాబు, సునీత తాటి, హ్యూన్వూ థామస్ కిమ్ వ్యవహరిస్తున్నారు. టీజర్ ప్రకారం నివేదా థామస్ తిండిబోతుగా రెజీనాకి ఓసీడీ సమస్యతో ఉన్నట్లు చూపిస్తారు. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఈ ఇద్దరు ఒక పోలీసు అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. అలానే శిక్షణ శిబిరంలో వీరిద్దరి మధ్య జరిగే కామెడీ సున్నివేశాలు ప్రేక్షకులను అలరించే విధంగానే ఉన్నాయనే చెప్పుకోవాలి. ఈ సినిమాలోని ప్రధాని కథ ఏమిటంటే కొందరు అబ్బాయిలు అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్నట్లు అలానే సుత్తితో కొడుతున్నట్లు టీజర్ లో చూపించడం జరిగింది.
టీజర్ ను చూసిన ప్రేక్షకులు ఈ చిత్రం మంచి వినోదం అందిస్తుందని తెలుస్తుంది. విజయ్ కుమార్, సీనియర్ నటుడు పృధ్విరాజ్ తదితరులు కీలక పాత్రను పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్
రిచార్డ్ ప్రసాద్ పనిచేయడం జరుగుతుంది. సంగీత స్వరాలను మైకీ మెక్‌క్లియరీ అందిస్తున్నారు.


























