మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు ముద్దుల తనయ కొణిదెల నిహారిక గంగూబాయి గెటప్‌లో అదరగొట్టింది. ఎప్పడూ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‌గా ఉండే నిహారిక తాజాగా గంగూబాయిలా మెరిసింది. బయోపిక్‌గా వచ్చిన గంగూబాయి కాఠియావాడి సినిమాలో ఆలియా భట్ లుక్‌నే అచ్చుగుద్దినట్లు రీక్రియేట్ చేసేసింది ఈ ముద్ధుగుమ్మ. ఇందుకు తెల్లని చీర, ఎర్రటి లిప్‌స్టిక్, కళ్లద్దాలు, నోటిలో పాన్, చేతిలో హ్యాండ్ బ్యాగుతో అమ్మడు సినిమాలోని స్టిల్స్‌ను తలపించేలా పోజులిచ్చింది. ఓ పార్టీ కోసం నిహారిక ఇలా రెడీ అయ్యింది. ఈ లుక్‌లోనే ఓ రీల్ కూడా చేసి సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.