Varun – Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్(Varun Tej), లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) ఇద్దరూ లవ్ చేసుకొని జూన్ 9న నిశ్చితార్థం(Engagement) చేసుకున్నారు. వరుణ్ – లావణ్య నిశ్చితార్థం హైదరాబాద్ లోని వరుణ్ తేజ్ ఇంట్లోనే నిన్న శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ నిశ్చితార్థం చాలా సింపుల్ గా కేవలం మెగా, అల్లు ఫ్యామిలీలు, లావణ్య ఫ్యామిలీలు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే జరిగింది.
వరుణ్ తేజ్, లావణ్య ఇద్దరూ తమ నిశ్చితార్థం ఫోటోలు నిన్న రాత్రే సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ గా మారాయి. ఇక లావణ్యకు మెగా అభిమానులు మెగా కోడలు అంటూ స్వాగతం చెప్తున్నారు. ఈ సంవత్సరంలోనే వీరి వివాహం ఉండే ఛాన్స్ ఉంది. పలువురు అభిమానులు, సెలబ్రిటీలు వీరికి సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెప్తున్నారు.
తాజాగా వరుణ్ తేజ్ చెల్లి నిహారిక ఈ నిశ్చితార్థంలో వరుణ్ – లావణ్యతో కలిసి దిగిన రెండు ఫొటోలు షేర్ చేసి స్పెషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ సమయం కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాను. వెల్కమ్ టు మై ఫ్యామిలీ వదిన అంటూ లావణ్యని ట్యాగ్ చేసింది. దీంతో నిహారిక చేసిన పోస్ట్ తో పాటు ఫొటోలు కూడా వైరల్ గా మారాయి. అభిమానులు కూడా లావణ్యకు మెగా ఫ్యామిలీలోకి వెల్కమ్ అంటూ పోస్టులు, కామెంట్స్ చేస్తున్నారు. నిహారికని మరిన్ని ఫొటోలు షేర్ చేయమని అడుగుతున్నారు. వారి ఇద్ధరీ నిచ్చితర్ధా ఫోటోస్ కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు .