Nithiin, Merlapaka Gandhi, Sreshth Movies Maestro Final Shooting Schedule Begins, Nabha Natesh, Tamannaah, Latest Telugu Movies, Film News, Telugu World Now,
FILM NEWS: నితిన్, మేర్లపాకగాంధీ, శ్రేష్ఠ్ మూవీస్ ‘మ్యాస్ట్రో’ ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం.
హీరో నితిన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘మ్యాస్ట్రో’. నితిన్ 30వ మూవీగా తెరకెక్కుతోన్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రైమ్ కామెడీ చిత్రంలో నితిన్ సరసన నభా నటేష్ హీరోయిన్‌గా నటిస్తుండగా హీరోయిన్ తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం ‘మ్యాస్ట్రో’ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుంది.
‘మ్యాస్ట్రో’ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ ఈ రోజు హైదరాబాద్‌లో మొదలైంది. హీరో నితిన్, తమన్నాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకుడు మేర్లపాక గాంధీ. ఈ షెడ్యూల్ చిత్రీకరణతో ‘మ్యాస్ట్రో’ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత షూటింగ్‌లో పాల్గొంటున్న హీరో నితిన్, అలాగే కోవిడ్ సెకండ్ వేవ్ తర్వాత చిత్రీకరణను మొదలుపెట్టిన బిగ్ మూవీ కూడా ‘మ్యాస్ట్రో’నే కావడం విశేషం.
ఇప్పటికే నితిన్ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన ‘మ్యాస్ట్రో’ ఫస్ట్‌లుక్, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇంతకు ముందు నితిన్ హిట్ మూవీ ‘భీష్మ’కు మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వరసాగరే..
శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై రాజ్ కుమార్ ఆకేళ్ళ సమర్పణలో ఎన్.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ‘మ్యాస్ట్రో’ సినిమాకు జె యువరాజ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు.
నటీనటులు:
నితిన్, నభానటేష్, తమన్నా, నరేష్, జిస్సూ సేన్ గుప్తా, శ్రీముఖి, అనన్య, హర్షవర్దన్, రచ్చ రవి, మంగ్లీ, శ్రీనివాసరెడ్డి
సాంకేతిక విభాగం:
డైరెక్షన్, డైలాగ్స్: మేర్లపాక గాంధీ
నిర్మాతలు: ఎన్. సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి
బ్యానర్: శ్రేష్ఠ్ మూవీస్
సమర్పణ: రాజ్‌కుమార్ ఆకేళ్ళ
మ్యూజిక్ డైరెక్టర్: మహతి స్వరసాగర్
డీఓపీ: జె యువరాజ్
ఎడిటర్: ఎస్‌ఆర్ శేఖర్
ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్
పీఆర్వో: వంశీ–శేఖర్