Political కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది.. పశ్చిమబెంగాల్లో సిలుగూరిలో ఒక కార్యక్రమానికి హాజరైన నితిన్ గట్కరి సభలో ప్రసంగిస్తూ ఒక్కసారిగా అస్వస్థకు గురయ్యారు..
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పశ్చిమ బెంగాల్ సిలుగూరిలో NH 10 జాతీయ రహదారి వెంబడి ప్రతిపాదిత 13 కి.మీ. పొడవైన నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాన్ని ప్రారంభించే కార్యక్రమానికి కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరై ప్రసంగిస్తున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అక్కడ అందరూ ఆందోళనకు గురయ్యారు.. సభలో ప్రసంగిస్తున్న సమయంలో ఇలా జరగటంతో అందరూ షాక్ కు గురయ్యారు.. వెంటనే ఆయనను డాక్టర్లు పరీక్షించి సకాలంలో చికిత్స అందించారు.. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అధికారులకు ఫోన్ చేసి అసలు విషయం ఆరా తీశారు.. మెరుగైన చికిత్స అందేలా చూడాలంటూ ఆదేశించారు..
పశ్చిమబెంగాల్లో సిలిగురిలోని శివ మందిరం నుంచి సేవక్ కంటోన్మెంట్ వరకు నిర్మించదలచిన రహదారికి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు కూడా తన ట్విట్టర్ లో షేర్ చేశారు.. అనంతరం డార్జిలింగ్ జంక్షన్ సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న నితిన్ ప్రసంగిస్తూ ఈ విధంగా గురయ్యారు.. ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం అధికారులతో మాట్లాడి గట్కరి ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలుసుకున్నట్లు తెలుస్తోంది..