100 Years of NTR : ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు గత సంవత్సర కాలంగా చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు, పలువురు తెలుగు ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక ఆయన శత జయంతి మే 28న అనేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.
ఇటీవల కాలంలో పలు పాత సినిమాలు రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల హిట్ సినిమాలు, క్లాసిక్ సినిమాలను ఇటీవల కాలంలో రీ రిలీజ్ చేస్తున్నారు. కలెక్షన్స్ వస్తుండటం, అభిమానులు హంగామా చేస్తుండటంతో ఈ రీ రిలీజ్ లు మరింత ఎక్కువయ్యాయి. దీంతో ఎన్టీఆర్ సినిమాని కూడా ఆయన పుట్టిన రోజు నాడు రిలీజ్ చేద్దామని ఎన్టీఆర్ అభిమానులు భావించారు. దీంతో ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సినిమాల్లో ఒకటైన అడవి రాముడు సినిమాని మే 28న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.ఇంకా ఆ రోజు NTR ఫ్యాన్స్ కి పండగే .
రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్టీఆర్, జయసుధ, జయప్రద ముఖ్య పాత్రల్లో 1977 లో తెరకెక్కిన కమర్షియల్ సినిమా అడవిరాముడు. ఆ రోజుల్లో మూడు కోట్ల కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమాగా అడవిరాముడు సరికొత్త రికార్డులని సృష్టించింది. అనేక సెంటర్స్ లో ఈ సినిమా 100 రోజులు ఆడింది. ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. ఇక ఈ సినిమాలోని పాటలు అయితే ఇప్పటికి మారుమ్రోగుతాయి. NTR అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో అడవి రాముడు సినిమాను రీ రిలీజ్ చేయాలని బలంగా కోరుతున్నారు .