Crime శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన తిరుమల ప్రత్యేకత ఎంతో ఉన్నతమైనది.. నిత్యం భక్తులతో పోటెత్తే తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టు ఉంటుంది.. ప్రస్తుతం కూడా తిరుపతిలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తుల తాకిడి ఎక్కువగా వుంది.. ఆయన చూడటానికి కుటుంబ సమేతంగా ప్రతినిత్యం ఎంతో మంది భక్తులు తిరుమల కు వస్తూ ఉంటారు.. అయితే కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే ఆ వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా మోసగాళ్లు ఏమాత్రం తగ్గటం లేదు టికెట్ల పేరుతో ఆన్లైన్లో మోసానికి ఒడిగడుతున్నారు తాజాగా వెలుగు చూసిన ఈ సంఘటన అందర్నీ షాక్ కి గురిచేస్తుంది..
తిరుమలకు వచ్చేందుకు భక్తులు ఎన్నో ప్లాన్లు వేసుకుంటారు అందులో ముఖ్యంగా టీటీడీ విడుదల చేసే టిక్కెట్ల కోసం ఎప్పటినుంచో ఎదురుచూసే భక్తులు ఎందరో అయితే చాలాసార్లు ఎంతగా ఎదురు చూసిన టికెట్లు దొరకవు. దీంతో భక్తులు నిరాశ చెందుతూ ఉంటారు ఈ విషయాన్ని అవకాశంగా తీసుకొని కొందరు కేటుగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు..
టీటీడీ టికెట్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆన్ లైన్ వేదికగా టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్ల అమ్మకం వ్యవహారాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ విషయంపై విచారణ జరిపిన పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు… కడప జిల్లా యర్రగుంట్లలో షేక్ మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తి టెలిగ్రామ్ లో శ్రీవారి దర్శన టికెట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు..