Telugu World Now
No Result
View All Result
Tuesday, July 1, 2025
  • Login
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
Telugu World Now
  • Home
  • Latest News
  • Andhra Pradesh
  • Telangana
  • Film News
  • Bhakthi
  • Health
  • About Us
  • Contact Us
No Result
View All Result
Telugu World Now
No Result
View All Result
Home Entertainment

Operation Valentine : ఇలాంటి సినిమాలు ఆడాలి. ముఖ్యంగా యూత్ చూడాలి : ప్రీరిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి

'Operation Valentine' is like a visual feast. We all have the responsibility to make the movie a success and salute our soldiers, Chiranjeevi

Sowmya by Sowmya
February 26, 2024
in Entertainment, Film News
'Operation Valentine' is like a visual feast. We all have the responsibility to make the movie a success and salute our soldiers, Chiranjeevi at prerelease event,Varun Tej, Shakti Pratap Singh Hada,

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. గాడ్ బ్లెస్ ఎంటర్‌టైన్‌మెంట్ (వకీల్ ఖాన్), నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతలు. టీజర్, ట్రైలర్ ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ.. మా కుటుంబంలో ఎవరి ఈవెంట్ జరిగినా తమ ఇంట్లో వేడుకలా ఉరకలెత్తే ఉత్సాహంతో ముందుకు వచ్చి మమ్మల్ని ఉత్సాహపరిచే మా అభిమానులు శిరస్సువంచి నమస్కారిస్తున్నాను. నేను కొన్ని రోజుల క్రితం  అమెరికాలో ఉన్నప్పుడు ‘నీతో మాట్లాడాలి డాడీ’ అంటూ వరుణ్ తేజ్ నుంచి మెసేజ్ వచ్చింది. వరుణ్‌ సాధారణంగా నాకు మెసేజ్‌లు పెట్టడు.. నేరుగా మాట్లాడతాడు. ఏమైందో అనుకున్నా. హైదరాబాద్‌ తిరిగొచ్చాక ఈ సినిమా, ఈవెంట్‌ గురించి చెప్పాడు. రియల్‌ హీరోలపై తీసిన చిత్రం గురించి మీరు  చెబితే రీచ్‌ వేరేలా ఉంటుందన్నాడు. సరహద్దుల్లో ఉంటూ మనల్ని కాపాడే వారియర్స్‌ గురించి చెప్పడం నాకు దక్కిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. ఈ వేడుకకు రావడం గర్వంగా ఉంది.

పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీర మరణం పొందారు. అది గుర్తొచ్చినప్పుడల్లా మనసు హృదయవిదారకరంగా ఉంటుంది. ఆ దాడిలో వీరమరణం పొందిన జవాన్లకు నివాళి అర్పించేలా.. దానికి కారణమైన శత్రువులపై ప్రతీకారం తీర్చుకునేందుకు మన భారత వైమానిక దళం చేసిన సాహసోపేతమైన యుద్ధమే ఈ సినిమా.  ఫిబ్రవరి 14న ఈ సర్జికల్ స్ట్రయిక్స్ చోటు చేసుకుంది కాబట్టి సినిమా పరంగా పెట్టిన పేరు ‘ఆపరేషన్ వాలెంటైన్’అని వరుణ్ చెప్పినప్పుడు చాలా సెన్సిబుల్ గా వుందనిపించింది. తెలుగులో అవకాశాలు వుంటాయి, మంచి పారితోషికం ఉంటుందని, కమర్షియల్‌ డైరెక్టర్‌గా స్థిరపడిపోవచ్చనే ఉద్దేశంతో దర్శకుడు శక్తి ప్రతాప్‌ ఇక్కడకు రాలేదు. తన సొంత ఖర్చుతో దాదాపు ఐదు లక్షలు ఖర్చు చేసి సర్జికల్‌ స్ట్రైక్‌పై షార్ట్‌ ఫిల్మ్‌ తీశాడు. ఇండియన్‌ ఎయిర్స్‌ ఫోర్స్‌ అది చూసి ఆశ్చర్యపోయింది. ఈసారి సినిమా తీస్తే మరింత సమాచారం మేమిస్తామని అధికారులు ఆయన్ను ప్రోత్సాహించారు. వారు ఇచ్చిన సమాచారంతో ఈ కంటెంట్ ని అద్భుతంగా తీశాడు.

సిద్దు, సోనీ పిక్చర్స్ కలసి చాలా గ్రాండ్ గా ఈ సినిమాని నిర్మించారు. సినిమా అద్భుతంగా వచ్చిందని చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఇలాంటి సినిమాలు ఆడాలి. ముఖ్యంగా యూత్ చూడాలి. ఇలాంటి సినిమాలు చూస్తున్నప్పుడు దేశభక్తి ఉప్పొంగుతుంది. రియల్ హీరోస్ కి ఒక సెల్యూట్ గా ఈ సినిమా మనమందరం చూసి తీరాలి. ఈ చిత్రాన్ని 75 రోజుల్లో చిత్రీకరించారు. రిజనబుల్ బడ్జెట్‌లో ఇలాంటి విజువల్స్‌, రిచ్ నెస్ ఇవ్వడం ఆషామాషీ విషయం కాదు. ఆ విషయంలో సినిమా విడుదలకు ముందే దర్శకుడు శక్తి సక్సెస్‌ అయ్యారు. దీన్ని అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి. నవదీప్‌ మా కుటుంబ సభ్యుడిలాంటివాడు. రామ్‌ చరణ్‌ ‘ధ్రువ’ సినిమాలోని తన నటన నాకు ఇష్టం. ఇందులోనూ మంచి పాత్ర పోషించాడు. అభినవ్‌ ట్యాలెంటెడ్. సోషల్‌ మీడియాలో కనిపించే మీమ్స్‌లో తనే ఎక్కువగా కనిపిస్తాడు.

చరణ్‌, వరుణ్‌.. ఇలా వీరంతా నన్ను చూస్తూ వేరే రంగంలోకి వెళ్లలేకపోయారని భావిస్తాను. చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగారు. ఈ విషయంలో నేను అందరినీ ప్రోత్సహిస్తా. ఎందుకంటే చిత్ర పరిశ్రమను నేను గౌరవిస్తా. మనం ఎంతగా గౌరవిస్తే అంతగా మనల్ని అక్కున చేర్చుకుంటుందని బలంగా నమ్మా. అలాంటి ఇండస్ట్రీలోకి నా బిడ్డలొచ్చారంటే ఇంతకంటే కావాల్సిందేముంది. నన్ను స్ఫూర్తిగా తీసుకొని పరిశ్రమలోకి వచ్చారమో కానీ నటుడిగా వరుణ్‌ నన్ను ఎప్పుడూ ఫాలోకాలేదు. ముందు నుంచీ విభిన్న కథలు ఎంపిక చేసుకుంటూ వస్తున్నాడు. మా కుటుంబ హీరోల్లో ఎవరికీ రాని ఇలాంటి అవకాశాలు వరుణ్‌కు వచ్చాయి. తను అవకాశాన్ని క్రియేట్ చేసుకున్నాడు. ముకుంద, కంచె, గద్దలకొండ గణేష్, ఫిదా, తొలిప్రేమ ఇవన్నీ దేనికవే భిన్నమైన చిత్రాలు. అన్ని జోనర్స్ ని టచ్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళ్తున్నాడు.

ఎయిర్‌ ఫోర్స్‌పై టాలీవుడ్‌లో తెరకెక్కిన తొలి చిత్రమిదే. ఈ చిత్రం ప్రేక్షకులకు కన్నుల పండగలా వుంటుంది. గతేడాది హాలీవుడ్‌ సినిమా ‘టాప్‌గన్‌’లోని విజువల్స్‌ చూసి ఇలాంటిది మనం తీయగలమా? అనుకున్నా. ఇప్పుడు మన వాళ్ళు వరుణ్, సిద్దు, శక్తి వీరంతా ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ అదే స్థాయిలో తీశారు. టాలెంట్‌ ఒకరి సొత్తు కాదు. మనం కూడా ఆ స్థాయిలో వున్నాం.  సినిమాలో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులందరికీ నా బెస్ట్ విషెష్. ఈ సినిమా గొప్ప విజువల్ ఎక్స్ పీరియన్స్. మార్చి 1న థియేటర్లలో చూసేందుకు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమాని విజయవంతం చేసి మన సైనికులకు సెల్యూట్‌ చేయాల్సిన బాధ్యత అందరిపై వుంది. జై హింద్” అన్నారు.

Related Posts

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల
Film News

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”
Film News

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ
Film News

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం
Film News

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక
Film News

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు
Film News

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్
Film News

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్
Film News

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్
Film News

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్
Film News

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
IOS app IOS app IOS app
ADVERTISEMENT
Google News Google News Google News
ADVERTISEMENT
Follow WhatsApp Channel Follow WhatsApp Channel Follow WhatsApp Channel
ADVERTISEMENT
Pakka Real Estate Pakka Real Estate Pakka Real Estate
ADVERTISEMENT
Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram Bhakthi TV Omkaram
ADVERTISEMENT
Google Play Store Google Play Store Google Play Store
ADVERTISEMENT

Recent News

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025
మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

మరో నెలలో ఫెంటాస్టిక్ ఫోర్: ఫస్ట్ స్టెప్స్ – గెలాక్టస్‌తో యుద్ధానికి సిద్ధం

June 26, 2025
నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

నిహారిక కొణిదెల నిర్మిస్తోన్న సినిమాలో సంగీత్ శోభన్ సరసన హీరోయిన్‌గా నయన్ సారిక

June 26, 2025
“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

“పోలీస్ వారి హెచ్చరిక ” సినిమా టీజర్ ను  ఆవిష్కరించిన హీరో సుధీర్ బాబు

June 25, 2025
Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

Latest Film News : ‘వర్జిన్ బాయ్స్’ చిత్రం నుండి ‘దం దిగ దం’ సాంగ్ లాంచ్

June 25, 2025
Latest Film News :  హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

Latest Film News : హాలీవుడ్‌లో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్

June 25, 2025
హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

హీరో నితిన్ మూవీ “తమ్ముడు” నుంచి ‘జై బగళాముఖీ..’ సాంగ్ రిలీజ్

June 24, 2025
రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

రేపు “సమ్మతమే” మూవీ ఫేమ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి, యూజీ ప్రొడక్షన్స్ నెం.2 కొత్త సినిమా అనౌన్స్ మెంట్

June 24, 2025
Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

Film News : నవీన్ చంద్ర నటించిన ‘షోటైం’ మూవీ ట్రయిలర్ విడుదల

June 24, 2025
‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

‘8 వసంతాలు’ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా: సక్సెస్ మీట్ లో హీరోయిన్ అనంతిక సనీల్‌కుమార్ & టీం

June 24, 2025
Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

Latest Film News : ‘ది 100 ‘ జూలై 11న గ్రాండ్ రిలీజ్- “హే మేఘలే” లిరికల్ వీడియో లాంచ్

June 21, 2025
‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

‘కుబేర’కు యునానిమస్ బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్ యూ: సక్సెస్ మీట్‌లో కింగ్ నాగార్జున

June 21, 2025
Advertisement Advertisement Advertisement
ADVERTISEMENT

Recent News

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

Latest Telugu Movies : “ప్రేమిస్తున్నా” సినిమా ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్ అరెరె విడుదల

July 1, 2025
అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం : డ్రగ్స్ వ్యతిరేక ప్రచారాన్ని బాధ్యతగా తీసుకుంటా – హీరో విజయ్ దేవరకొండ

June 27, 2025
Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

Latest Film News : ఎస్‌జె సూర్య, శ్రీ గొకులం మూవీస్‌ భారీ పాన్‌ ఇండియా మూవీ టైటిల్ “కిల్లర్”

June 27, 2025
Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

Latest Movie News : సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున నటిస్తున్న ‘కూలీ’ మూవీ

June 26, 2025

Categories

  • Andhra Pradesh
  • Andhra Pradesh
  • Arts
  • Bhakthi
  • CRIME – Police News
  • Editors
  • Entertainment
  • Film News
  • Health
  • Journalist Audi
  • Latest News
  • Movie Reviews
  • National
  • Politics
  • Sports
  • Telangana
  • Uncategorized

Quick Links

  • Home
  • Contact Us
  • Privacy & Policy

Google News – Telugu World Now

Telugu World Now

మా వెబ్ సైట్ లో ప్రస్తుతం జరుగుతున్న అన్ని విషయాల ( రాజకీయాలు , సినిమాలు , లేటెస్ట్ న్యూస్ , హెల్త్, భక్తి , కళలు, టెక్నాలజీ , జ్యోతిష్యం ) మీద వార్తలు ప్రచురించడం జరుగుతుంది, సమకాలీన విషయాల పట్ల ఒక భిన్నమైన ఆలోచనను మీ ఎదుట నివేదించడం మాత్రమే మా ప్రయత్నం, చదివే వారిలో ఆవేశ కావేషాలను రెచ్చగొట్టడమూ.. ఉద్రేకాలను రేపడమూ ఈ వెబ్‌సైట్ ఉద్దేశం కాదు.

అన్ని రకాల వాదనలకు వేదికగా నిలిచేందుకు www.teluguworldnow.com తన వంతు ప్రయత్నిస్తుంది. వార్తా కథనాల్లో వచ్చే విశ్లేషణలకు విరుద్ధమైన వాదనలు ఎవరికైనా ఉంటే, వారు తర్కబద్ధంగా చెప్పదలచుకుంటే.. వాటిని కూడా ప్రచురిస్తుంది. తమ భావాలు పంపదలచుకున్న వారు.. teluguworldnow@gmail.com చిరునామాకు పంపవచ్చు. లేదా Whats’up +91 70132 94002 ద్వారా కూడా తమ అభిప్రాయాలను తెలియ చేయ వచ్చు, తర్కబద్ధంగా, సంయమనంతో ఉన్న ప్రతి అభిప్రాయాన్నీ ప్రచురిస్తాం.

.. ఎడిటర్

© 2024 Telugu World Now || All Rights Reserved V9 Media Entertainments || Developed by Ultrakey IT Solutions Pvt. Ltd.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

WhatsApp us