హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నచిత్రం ‘ఓటు’. ‘చాలా విలువైనది’ అనేది ట్యాగ్ లైన్. ఫ్లిక్ నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.
‘మనదేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయబేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ లో పొలిటికల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ కూడా అలరించాయి. ‘’మందుకు నోటుకు ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా ? ఓటు అనేది హక్కు కాదు మన బాధ్యత’ లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయి.
హృతిక్ శౌర్య టీజర్ లో ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు. అనుభవం వున్న నటుడిలా తన పాత్రలో ఒదిగిపోయారు. హృతిక్ శౌర్య, తన్వి నేగి కెమిస్ట్రీ కూడా బ్యూటీఫుల్ గా వుంది. గోపరాజు రమణ కీలక పాత్రలో కనిపించారు. నేపధ్య సంగీతం, కెమరాపనితనం ఆకట్టుకున్నాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.