Political ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు పర్యటిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా గుంకలంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని పరిశీలించిన పవన్ కళ్యాణ్.. వైయస్సార్ పార్టీ నాయకులను విమర్శించారు. ఇప్పటికైనా ఆంధ్ర ప్రజలు ఇక్కడ జరుగుతున్న మోసాలను గుర్తించాలని.. వైయస్సార్ కాలనీల పేరిట వేలకోట్ల అవినీతి జరుగుతుందని.. జనసేనకు ఒక అవకాశం ఇస్తే అసలైన అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తామని చెప్పుకొచ్చారు..
విజయనగరం జిల్లా గుంకలంలో నిర్మిస్తున్న జగనన్న కాలనీ చూసినా పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. ఉత్తరాంధ్ర ప్రజలను రాజధాని పేరిట అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోసం చేస్తున్నారని.. బంగారు భవిష్యత్ కోసం ఉత్తరాంధ్రులు జనసేనను నమ్మాలని అన్నారు..
“ఇళ్ల నిర్మాణం పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతి జరిగింది.. ఈ విషయం ప్రజలకు తెలియటం లేదు.. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలందరికీ ఉచితంగా ఇసుక ఇస్తాము. వైసిపి ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజలంతా తప్పకుండా గుర్తించాలి.. జనసేన పార్టీకి ఒక్క అవకాశం ఇస్తే నిజమైన అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తాం.. యువత తన శక్తిని అవినీతిని నిర్మూలించడానికి ఉపయోగించాలి రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరూ తప్పకుండా పాటుపడాలి అందుకోసం తనపై నమ్మకం ఉంచాలని అప్పుడు తాను ఈ వైసీపీ గూండాలతో పోరాడేందుకు సిద్ధమే.. మత్స్యకారులు ఉపాధి కోసం గోవా, ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారని.. జనసేన అధికారంలోకి వస్తే ఇక్కడే జెట్టీలు నిర్మించి వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం..” అన్నారు పవన్ కళ్యాణ్..