Naga Shaurya : టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ‘రంగబలి’ అనే కొత్త సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి డైరెక్ట్ ఈ సినిమాని చేస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగగా మూవీ టీం మీడియా ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమంలో ఒకరు రంగబలి షూటింగ్ సమయంలో నాగశౌర్య అస్వస్థతకు గురి అయిన విషయం గురించి ప్రశ్నించారు. దీంతో ఆరోజు అసలు ఏమైందనేది దర్శకుడు తెలియజేశాడు.
దర్శకుడు మాట్లాడుతూ.. “సినిమాలో వచ్చే ఫస్ట్ ఫైట్ కోసం కొంచెం సిక్స్ ప్యాక్ బాడీ అది చూపించాలని అడిగాను హీరో గారిని. దీంతో ఆ షూట్ కోసం రెండు రోజులు నుంచి వాటర్ తీసుకోవడం మానేశారు. ఆ సీన్ షూట్ చేస్తున్న సమయంలోనే ఆయన చాలా గట్టిగా ఊపిరి తీసుకోవడం గమనించే ఇవాళ్టి చాలు అని ఆయన్ని పంపించేసి బ్యాలన్స్ షూట్ మేము షూట్ చేస్తున్నాము. ఇంతలో న్యూస్ వచ్చింది. ఇలా హీరో నాగశౌర్య కళ్ళు తిరిగి పడిపోయారని. వెంటనే మేము కూడా హాస్పిటల్ కి వెళ్ళాం. ఆరోజు డాక్టర్స్ ఏమి చెప్పారంటే.. కొంచెం లేట్ అయ్యుంటే ప్రాణాలకు ఇబ్బందయ్యేదని చెప్పారు” అని తెలియజేశాడు.
అంత జరిగిన తరువాత కూడా నాగశౌర్య.. బ్యాలన్స్ షూట్ ఎప్పుడు ప్లాన్ చేద్దామని అడిగాడట. ఇక ఆ మాటలు విన్న నాగశౌర్య తండ్రి కోపడినట్లు చెప్పుకొచ్చాడు. ఎందుకంటే మరో 6 రోజుల్లో నాగశౌర్య పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. దీంతో కుటుంబసభ్యులు అప్పుడు చాలా కంగారు పడ్డారు. ఫ్యామిలీ మెంబెర్స్ చెప్పడంతో పెళ్లి అయ్యేవరకు షూటింగ్ బ్రేక్ ఇచ్చేశాడు. నవంబర్ 20, 2022న బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ అనూషా శెట్టిని నాగశౌర్య వివాహం చేసుకున్నాడు.