Pawan Kalyan : నట సింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా చేస్తున్న టాక్ షో “అన్‌స్టాపబుల్” విత్ ఎన్‌బీకే. తొలి తెలుగు ఓటీటీ ఆహా వేదికగా టెలికాస్ట్ అవుతోన్న ఈ ప్రోగ్రామ్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే మొదటి సీజన్‌ను విజయవంతగా పూర్తి చేసుకున్న ఈ షో రెండో ఎపిసోడ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇక రెండో సీజన్ ని కూడా మేకర్స్ త్వరలోనే ఫుల్‌స్టాప్ పెట్టబోతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి ఈ సెకండ్ సీజన్ లాస్ట్ ఎపిసోడ్‌పై పడింది. చివరి ఎపిసోడ్‌కు ముఖ్య అతిథిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతుండడం అందరి అంచనాలను భారీ స్థాయిలో పెంచింది.
పవన్ అన్‌స్టాపబుల్‌కు హాజరుకానున్నారన్న వార్త బయటకు రాగానే ఫ్యాన్స్‌లో జోష్‌ని పెంచేసింది. పవన్ హాజరుకానున్న ఈ షోను మేకర్స్ రెండు పార్ట్స్‌గా స్ట్రీమింగ్ చేయనున్నారు. మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 3వ తేదీన స్ట్రీమింగ్ కానుండగా, రెండో ఎపిసోడ్ ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. స్ట్రీమింగ్ తేదీ దగ్గరపడుతోన్న నేపథ్యంలో షోపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. బాలయ్య ప్రశ్నలకు పవన్ ఎలాంటి సమాధానాలు ఇస్తారనే ప్రశ్న మొదలైంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమో ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా పవన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
ముఖ్యంగా వదిన సురేఖ, అల్లు అరవింద్ తల్లి కనకరత్నం ప్రోత్సాహంతో పాటు సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న ఆటుపోట్లకు సంబంధించి పవన్ వ్యాఖ్యానించారు. ఇక విశాఖపట్నంలోని జగదాంబ సెంటర్‌లో బస్సు పైన డ్యాన్స్ చేయాల్సి వచ్చిందన్న విషయాలను పంచుకున్నారు. ఇదిలా ఉంటే పవన్ తొలిసారి తన మూడు పెళ్లిలపై కూడా ఈ షోలో స్పందించారు. దీంతో ఇంతకీ పవన్ ఈ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాడన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కాగా ఈరోజు రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. కాగా గతంలో ప్రభాస్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయినప్పుడు సైట్ క్రాష్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ ఎపిసోడ్ కోసం స్పెషల్ టీంని కూడా ఏర్పాటు చేసినట్లు ఆహా నిర్వాహకులు వెల్లడించారు.