Pawan Kalyan Vakeelsaab Movie Release Problems,Tollywood Updates, Latest Telugu Movies,
“పవన్ కళ్యాణ్” “ఆజ్ఞతవాసి” సినిమా తర్వాత వస్తున్న “వకీల్ సాబ్”.. కి పాపం ఎన్నో అడ్డంకులు.
*కరోనా కేసుల పెరుగుదల సినిమాకి అడ్డంకి
*50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతి
*మిడ్ నైట్ షోలకు పర్మిషన్లు కట్ కట్
*ఇప్పటికే బ్లాక్ బస్టర్ కి మొహం వాచి ఉన్న పవన్
*అజ్ఞాత వాసి తర్వాత విడుదలవుతున్న వకీల్ సాబ్
*పింక్ కు రీమేక్ చేసిన పవన్
పవన్ కళ్యాణ్ అంటే చెప్పేదేముందీ.. బ్యాలెట్ బాక్సుల దగ్గర పరిస్థితి ఎలా ఉన్నా.. బాక్సాఫీజ్ దగ్గర కాసుల వర్షం కురిపించగల కమర్షియల్ నేమ్ అండ్ ఫేమ్ ఆయన సొంతం. అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా అజ్ఞాత వాసి అనే అట్టర్ ఫ్లాప్ సినిమా తర్వాత వస్తున్న వకీల్ సాబ్.. కి పాపం ఎన్నో అడ్డంకులు.
ఇప్పటికే కర్ణాటకలో 50 శాతం ఆక్యుపెన్సీతో విడుదలకు అన్నీ ఏర్పాట్లు చేసేశారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితులే. రాక రాక వస్తున్న సినిమా. ట్రైలర్ రిలీజ్ కూడా భారీ హిట్టు. అద్దాలు పగలగొట్టుకుని వచ్చి మరీ చూశారు అభిమానులు. ఇప్పటికే ట్రైలర్ ని మూడున్నర కోట్ల మంది యూట్యూబ్ లో చూశారు. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆల్ షోస్ హౌస్ ఫుల్. మహేష్ బాబు సైతం తన థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్స్ చూసి ఫుల్ ఖుష్.
కానీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా.. సినిమా పర్మిషన్లు తగ్గుతున్నాయి. ఆటలు పెంచనివ్వడం లేదు. ఆక్యుపెన్సీ అంతకన్నా పెంచనివ్వడం లేదు. దీంతో ఫుల్ జోష్ లో ఉండాల్సిన పవన్ ఫ్యాన్స్ కాస్తా.. బ్యాడ్ న్యూస్ కారణంగా బ్యాడ్ సిట్యువేషన్ ఫేస్ చేస్తున్నారు.