అభిరామ్ వర్మ, తనికెళ్ల భరణి, శ్వేతావర్మ, కల్పిక గణేష్, అదితి మ్యాకల్ ప్రదాన పాత్రదారులుగా వరుణ్ వంశీ బి. దర్శకత్వంలో ఆనంద థాట్స్ అండ్ సంస్కృతి ప్రొడక్షన్స్ బ్యానర్లు పై కళ్యాణ్ శాస్త్రి, శ్రీరామ్ కె, పూజ యం. సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఏకమ్”.
ఫిలాసిఫికల్ ఫిక్షన్ జోనర్లో మొట్ట మొదటిసారిగా తెలుగులో రూపొందుతున్న “ఏకమ్” చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని మార్చ్ 5న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నారు.. కాగా ఈ చిత్రం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సర్క్యూట్ లో ఈ చిత్రానికి 4 నాలుగు ఫిల్మ్ ఫేర్ ఆవార్డ్స్ రావడం గొప్ప విశేషం. అటు ప్రేక్షకుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ “ఏకమ్” చిత్రంపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.
ఈ చిత్రంలోని పాటలకి, టీజర్స్ కి పబ్లిక్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్బంగా ఫిబ్రవరి 10న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.. ఈ సమావేశంలో హీరో అభిరామ్, హీరోయిన్ కల్పిక గణేష్, నటుడు దయానంద్ రెడ్డి, దర్శకుడు వరుణ్ వంశీ, నిర్మాత కళ్యాణ్ శాస్త్రి పాల్గొన్నారు..