Prashanth in April 2017 Had Crossed illegally the Indo-Pak Border And was Detained by Pakistan Authorities, CP Sajjanar IPS, Telangana Police,
ఇండో-పాక్ సరిహద్దును అక్రమంగా దాటిన ప్రశాంత్‌ను అదుపులోకి తీసుకొని సురక్షితంగా విడుదల చేసిన పాకిస్తాన్ అధికారులు.
ఏప్రిల్ 2017 లో మాధపూర్ పోలీస్ స్టేషన్ ఏరియా లిమిట్స్ నుండి తప్పిపోయిన వ్యక్తి ఇండో-పాక్ సరిహద్దును అక్రమంగా దాటినందుకు పాకిస్తాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను 31.05.2021 న విడుదల చేసి భారత అధికారులకు అప్పగించారు. తమ కుమారుడు ప్రశాంత్‌ను సురక్షితంగా విడుదల చేసినందుకు తల్లిదండ్రులు తెలంగాణ ప్రభుత్వానికి, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
మిస్టర్ ప్రశాంత్ అనే ఐటి ఉద్యోగి 2017 ఏప్రిల్ 11 న తప్పిపోయాడు. అతని కుటుంబం 29.04.2017 న తమ కొడుకు తప్పిపోయినందుకు మాధపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు , Cr.No.388 / 2017 గ కేసు నమోదైంది. తప్పిపోయిన వ్యక్తిని కనిపెట్టడానికి పోలీసులు అన్ని ప్రయత్నాలు చేశారు. తరువాత, అతన్ని పాకిస్తాన్లో అదుపులోకి తీసుకున్నట్లు కుటుంబ సభ్యులకు సందేశం వచ్చింది. కుటుంబ సభ్యులు వెంటనే సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వ దృష్టికి వచ్చారు. భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రి, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం వివరాలు తెలుసుకుంటూ ఉన్నారు, పాకిస్థాన్ తప్పిపోయిన వ్యక్తిని విడుదల చేసి 31.05.2021 న భారత అధికారులకు అప్పగించారు, ఆయనను పంజాబ్ లోని అటారీ వద్ద ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ పి. రవీంద్ర ప్రసాద్ మాధపూర్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు,
ప్రశాంత్‌ను సురక్షితంగా విడుదల చేసినందుకు ప్రశాంత్ కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఐటి ఉద్యోగి అయిన ప్రశాంత్ వ్యక్తిగత కారణాల వల్ల స్విట్జర్లాండ్ చేరుకోవాలనుకున్నారు. అతనికి తగినంత ఆర్థిక సహాయం లేకపోవడంతో, అతను నడిచి స్విట్జర్లాండ్ చేరుకోవాలనుకున్నాడు. ఈ ప్రణాళికలో భాగంగా, అతను 11.04.2017 న ఇంటి నుండి బయలుదేరి, రాజస్థాన్ లోని బికనేర్కు రైలు ఎక్కి, అక్కడి నుండి ఇండో-పాక్ సరిహద్దుకు వెళ్లి, అక్కడ కంచెపైకి దూకి అక్రమంగా సరిహద్దును దాటాడు. పాకిస్తాన్ భూభాగంలోకి లోతుగా నడిచిన తరువాత, అతన్ని పాకిస్తాన్ అధికారులు పట్టుకున్నారు. తరువాత, ప్రశాంత్ ని పాకిస్తాన్ అధికారులు అక్రమంగా దేశంలోకి ప్రవేశించినందుకు కేసు నమోదు చేశారు ఇప్పుడు శిక్షా కాలం పూర్తయిన తరువాత, అతన్ని విడుదల చేసి 31.05.2021 న పంజాబ్లోని అటారీ సరిహద్దులోని భారత అధికారులకు అప్పగించారు, అనంతరం ఆయనను ఈ రోజు హైదరాబాద్‌కు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.