నాగార్జునసాగర్, నవంబర్ ,15. తెలంగాణ ప్రభుత్వము నాగార్జునసాగర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన బుద్ధవనం ప్రాజెక్ట్ పై తీసిన డాక్యుమెంటరీ చిత్రంపై జాతీయ పురస్కారం దక్కడం పట్ల బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య హర్షం వ్యక్తం చేశారు.
డి ఎస్ ఎన్ ఫిలిమ్స్ అధినేత దూలం సత్యనారాయణ ఆదివారం నాడు కలకత్తాలో జరిగిన పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా 9పి ఆర్ సి ఐ) ప్రపంచ సమాచార శిఖరాగ్ర సదస్సు 2022 లో జాతీయ వార్షిక పురస్కార ప్రధానోత్సవ సభలో ఈ అవార్డును అందుకున్నారని ఆయన తెలిపారు. అవార్డు గ్రహీత దూలం సత్యనారాయణ బృందాన్ని బుద్ధవనం అధికారులు సుధన్ రెడ్డి ,క్రాంతి బాబు ,శ్యాంసుందర్రావు ,బౌద్ధ విషయ నిపుణులు ఈమని శివనాగిరెడ్డి అభినందించారు.
https://youtu.be/T605qLjcfqE