సిరి ఎంటర్టైన్‌మెంట్స్ పతాకంపై సిరిపురం రాజేష్ డిటెక్టివ్ పాత్రలో నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం ‘కుట్ర’ (ద గేమ్ స్టార్స్ నవ్ ట్యాగ్‌లైన్). ప్రీతి, గీతిక రతన్, ప్రియ దేశ్‌పాల్ హీరోయిన్లు.
సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 23న గ్రాండ్ గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఫిలించాంబర్ లో ప్రీ-రిలీజ్ ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, టియస్ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎక్స్ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, టియస్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎక్స్ చైర్మన్ అమరవాది లక్ష్మినారాయణ, సినీ ప్రముఖులు తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, లయన్ సాయి వెంకట్, చిత్ర దర్శకుడు, నిర్మాత, నటుడు సిరిపురం రాజేష్, హీరోయిన్లు ప్రియ, గీతిక, ప్రీతి పాల్గొన్నారు.