Precauions for Corona Patients, New Covid Rules, Corona Vaccine, Latest Telugu News, Corona Updates,
కరోనా వైరస్ నుంచి భారత్ బయటపడాలంటే ఏం చెయ్యాలి…?
1. అన్ని న్యూస్ ఛానెల్స్లో సోషల్ మీడియాల్లో కరోనా న్యూస్ తెలపకుండా ప్రభుత్వం G.O పాస్ చెయ్యాలి…దీని వల్ల ప్రజల్లో అభద్రతా భావం పోతుంది…యాంటీ బాడీస్ యాధా విధిగా ప్రతి ఒక్కరిలో పనిచేస్తాయి…
2. ప్రస్తుతం చాలామంది అనుమానం, భయంతో చని పోతున్నారు కారణం సోషల్ మీడియాలో కరోనా పోస్టులే సగం కారణంగా భావించొచ్చు… ప్రతిక్షణం చావు కబుర్లు వింటుంటే తెలియకుండా ప్రతి ఒక్కరూ ప్యానిక్ అవ్వడం ఖాయం… కాబట్టి RIP అంటూ చావు కబుర్లని పోస్టుల మీద పోస్టులు పెట్టకుండా వాట్సాప్ గ్రూప్స్ ని కట్టడి చెయ్యాలి…
3. కరోనా అనేది అతి భయంకరమైన వైరస్ అన్నది ప్రతిఒక్కరికి అవగాహన వచ్చింది ఎవరికి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతం సెంకండ్ వేవ్ దారుణం మళ్లీ థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ రాబోతుంది అంటూ ప్రచారం చేస్తూ ప్రతి క్షణం ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసే ఏ మెసేజ్ క్రియేషన్ లేదా ఫార్వార్డ్ మెసేజులకు ఒక చట్టాన్ని క్రియేట్ చేసి వాట్సాప్ లేదా ఫెస్ బుక్ లేదా ఏ సోషల్ మీడియా గ్రూప్స్ల్ ఆ మెసేజ్ వ్యక్తిపై ఎవరన్న కంప్లైంట్ ఇస్తే పోలిసులు వాళ్లను అరెస్ట్ చేసే చట్టం వెంటనే అమల్లోకి రావాలి…
4. భారత్ లో ఏదైనా సమస్య ఎదురైతే ఎదుర్కొవడం అంత సులభమైన విషయం కాదు కాబట్టి వైద్య విధానంలో సమస్యల్ని నేరుగా అన్ని మీడియా ఛానల్స్ ప్రభుత్వాలకు లేదా న్యాయవ్యవస్థ కు తెలియజేయాలి, ఎట్టి పరిస్థితుల్లో కరోనా సమస్య సామాన్యుడికి తెలియకుండా కఠిన ఆంక్షలు విధించాలి… ప్రస్తుతం ఈ న్యూస్ స్ప్రెడ్స్ వల్ల హాస్పటల్ కు వెళ్లే ప్రతి పేషంట్ గతంలో తాను చూసిన దృశ్యాలు గుర్తుకు వచ్చి చనిపోతున్నాడు… కాబట్టి కరోనా బ్యాడ్ న్యూస్ తక్షణం భారత్ లో బంద్ కావాలి దీనిపైన ప్రభుత్వాలు న్యాయస్థానాలు ఒక నిర్ణయం తీసుకోవాలి…
5. ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా కరోనా బ్యాడ్ న్యూస్ తప్ప ఏదైనా సంతోషకరమైన విషయాలను తెలియజేయండి, ఇలా చెయ్యడం వల్ల కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే ఎవ్వరు కరోనా గురించి ప్రతిక్షణం ఆలోచించరు…ఇలా ప్రతి ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియాలో మార్పు రావాలి…
6. ప్రతి మనిషిలో అనుమానం, భయం చావాలి, దీనికి ఇదే సరైన మార్గం కాబట్టి మనందరిలో సంకల్ప బలం పెరగాలంటే పై వాటిపై ఎవరికి వారు వాట్సాప్ లేదా ఫెస్ బుక్ లేదా మరేదన్న సోషల్ మీడియాలో మన బాధ్యతగా కరోనా బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చెయ్యకుండా ఆ గ్రూప్ ఎడ్మిన్స్ అందరికి నిర్ణయాన్ని తెలపండి, ప్రతి గ్రూప్లో కరోనా ముందు ఎలాంటి సంతోషకరమైన విషయాల్ని పంచుకున్నారో అలాగే ఇప్పుడు వుండమని అందరికి పిలుపునివ్వండి…
7. టీవీ ఛానల్స్ లో వచ్చే కరోనా బ్యాడ్ న్యూస్ ఎవ్వరు చూడకండి, ఇంకొకరికి పంపకండి, దీనివల్ల ప్యానిక్ అయ్యే అవకాసం వుంది కాబట్టి మనసుకు సంతోషాన్ని కలిగించే కార్యక్రమాలనే చూడండి…సంతోషం సగం బలం అంటారు, పైగా ఎప్పుడు సంతోషంగా వుండే వాళ్ల దగ్గరికి ఏ రోగం దరిచేరదంటారు…ఆల్ వేస్ బి పాజిటివ్ బి హ్యాపీ నే స్ప్రెడ్ చెయ్యండి ఈ టైంలో ఇదే ప్రతి ఒక్కరికి సంజీవిని…
8. మనం హారర్ సినిమా చూసేటప్పుడు మనలో ఎలాంటి బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయో ఈ కరోనా చెడు వార్తల వల్ల మనలో బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతూ బాగున్న మన శరీరాన్ని మనమే నాశనం చేసుకునే అవకాశం వుంది…
9. మనందరం కరోనా పట్ల అవగాహన పెంచుకుందాం, కానీ ఆక్సిజన్ అందక ఇంత మంది చచ్చారు శవాల గుట్టలంటూ బ్యాడ్ ని స్ప్రెడ్ చెయ్యకండి, ఈ విజువల్స్ వల్ల మీలో భయం పెరిగి రేపు మీ ప్రాణాన్ని తియొచ్చు, కాబట్టి ఎవ్వరు ఇవి చూడటం మానెయ్యండి, ఈ లాక్ డౌన్ మొత్తం ఎంటర్టైన్మెంట్ లేదా కామెడీ వీడియోలు , పాజిటివ్ న్యూస్ చూడండి, ఏ క్షణం కూడా బ్యాడ్ న్యూస్ మీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడండి.. ఈ విషయాలు మీకు నచ్చితే అమల్లోకి తక్షణం తీసుకురండి, కొంత మంది ప్రజలను అడిగి తెలుసుకున్న విషయాలు మీకు తెలియ చేశాను, మిగిలిన మిత్రులకు ఫార్వార్డ్ చెయ్యండి…మీకు నచ్చితే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచెయ్యండి …సర్వేజనా సుఖినోభవంతు.