వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకుపోతున్న శివకార్తికేయన్ కథానాయకుడిగా, టాలెంటెడ్ డైరెక్టర్ అనుదీప్ కెవి దర్శకత్వంలో తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో తెరకెక్కిన కంప్లీట్ ఎంటర్టైనర్ ‘ప్రిన్స్’. శివకార్తికేయన్ సరసన మారియా ర్యాబోషప్క కథానాయిక నటిస్తోంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. పాన్ ఇండియా స్టార్ విజయ దేవరకొండ, స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిధులుగా ఈ వేడుకకు హాజరయ్యారు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సురేష్ ప్రొడక్షన్ వలన పెళ్లి చూపులు వచ్చింది. సునీల్ నారంగ్ గారు అర్జున్ రెడ్డిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. వీరిద్దరూ నా కెరీర్ లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. వారు నిర్మించిన ప్రిన్స్ ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొననడం ఆనందంగా వుంది. ఎవడే సుబ్రమణ్యం చేస్తున్నపుడు నాగ్ అశ్విన్ , అనుదీప్ షార్ట్ ఫిలిమ్స్ చూపించి తెగ ఎంజాయ్ చేసేవాడు. వారిద్దరూ కలసి జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ తీశారు. ఇప్పుడు అనుదీప్ ప్రిన్స్ అనే ఎంటర్ టైనర్ తో వస్తున్నారు. ట్రైలర్ చూసి చాలా ఎంజాయ్ చేశా. అనుదీప్ అందరినీ నవ్వించే దర్శకుడు.
అక్టోబర్ 21న ప్రిన్స్ తో మరో విజయం అందుకుంటారని భావిస్తున్నా. మారియాకి ఈ సినిమా మంచి జ్ఞాపకంగా వుంటుందని అనుకుంటున్నా. శివ కార్తికేయన్ ని ఎప్పుడూ కవలేదు కానీ నాకు చాలా ఇష్టమైన యాక్టర్. శివకార్తికేయన్ గారి జర్నీ నాకు చాలా నచ్చింది. శివగారు ఒక కార్యక్రమంలో ఏడుస్తుంటే అది చూసి బ్రదర్ ఫీలింగ్ వచ్చేసింది. అక్టోబర్ 21న ప్రిన్స్ థియేటర్లోకి వస్తుంది. నేను గ్యారెంటీగా చూస్తున్నా. మీరూ కూడా చూస్తారని కోరుకుంటున్నాను.