Health మనిషి రోజువారీ జీవితంలో నిద్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఓ వ్యక్తి ఎంత చురుగ్గా ఉండాలి, ఎంత ఆరోగ్యంగా ఉండాలో నిద్రే నిర్థరిస్తుంది అంటుంటారు… నిపుణులు. అయితే సమయం కానీ సమయంలో నిద్ర పోవడం వల్ల అనర్థాలు ఉన్నాయంటున్నారు. ఇందుకు సంబంధించి… ఇటీవల విడుదల ఓ నివేదిక ఆసక్తికర అంశాన్ని ప్రస్తావించింది… నిద్ర అలవాట్లు మన శరీరంలోని… కొన్ని ముఖ్య అవయవాల పనితీరును ప్రభావితం చేస్తాయంటూ తేల్చిన అధ్యయనం… పగటి పూట ఎక్కువగా నిద్రపోవడం వల్ల ఫ్యాన్ లివర్ సమస్య వచ్చే అవకాశం ఉన్నట్లు తేల్చింది.
అదే తీరుగా… ప్రశాంతంగా ఉండే రాత్రి వేళలో శరీరానికి కావాల్సినంత విశ్రాంతిని ఇవ్వకపోయినా… ఈ సమస్య ఎదురుకావచ్చని తేల్చింది. రాత్రి వేళ నిద్ర గురించి… ఇప్పటికే చాలా నివేదికలు వెలువడినా… పగలు అధిక నిద్ర వల్ల దుష్ప్రభావాలు తలెత్తుతాయని తేల్చింది… మాత్రం ఇప్పుడే. అందుకే… మధ్యాహ్నాం నిద్రను అదుపులో ఉంచుకోవాలని, రాత్రి వేళల్లో మంచి నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అందుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిని మీరు ఫాలో అవ్వండి.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం…. ప్రతీ వ్యక్తీ రోజూ ఒకే సమయంలో నిద్రపోయేందుకు ప్రత్నించాలి. అలానే ఖాళీ కడుపుతో నిద్రపోకపోవడం మంచిది…ఆకలిగా ఉంటే జీర్ణవ్యవస్థ ఇబ్బంది పెడుతుంది… దాంతో సరిగా నిద్ర పట్టదు. దాంతో పాటే… నిద్రకు వెళ్లే ముందు… నికోటిన్, కెఫిన్, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. పడక గదిలో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి… నిద్రపోయే ముందు ఫోన్లు వాడొద్దంటారు… నిపుణులు. వీటి స్క్రీన్ల నుంచి వచ్చే బ్లూ రేస్ నిద్రను భంగపరుస్తాయని చెబుతున్నారు.