Movie News:చిత్ర పరిశ్రమలు నిలదొక్కుకోవడం అనేది చాలా కష్టమని చెప్పుకోవాలి. అది హీరో దగ్గర నుండి నిర్మాత వరకు ఎంతో కష్టపడితేనే సక్సెస్ అనేది దక్కుతుంది. అలా కష్టపడుతూ ఈ ఏడాది సూపర్ హిట్ అందుకున్నారు అభిషేక్ అగర్వాల్.గూఢచారి మినహా అభిషేక్ నిర్మించిన సినిమాలన్నీ తీవ్రంగా నిరాశ పరిచయాన్ని చెప్పుకోవాలి.కిరాక్ పార్టీ, సీత, ఎ-1 ఎక్స్‌ప్రెస్ లాంటి ఫ్లాపులు చవిచూశారు అభిషేక్ అగర్వాల్. కానీ ఈ ఏడాదిలో విడుదలైన ‘ది కశ్మీర్ ఫైల్స్, కార్తికేయ-2 ఈ రెండు చిత్రాలకు ప్రస్తుతం టాలీవుడ్ బాలీవుడ్ లో అభిషేక్ అగర్వాల్ పేరు వినిపించేలా చేస్తున్నాయి.
అభిషేక్ అగర్వాల్ హిందీలో అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించిన చిత్రం ది కశ్మీర్ ఫైల్స్ ఈ చిత్రాని 25 కోట్ల బడ్జెట్లో తరాకెక్కించి 340 కోట్లకు పైగా వసూళ్లు అందుకున్నారు అభిషేక్. ఆ రేంజ్ లో బాలీవుడ్ లో సూపర్ హిట్ అందుకుంది ది కశ్మీర్ ఫైల్స్. ఇదిలా ఉంటే తెలుగులో విడుదలైన కార్తికేయ 2 విడుదలైన రెండు రోజుల్లోనే హౌస్ ఫుల్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. ఈ సినిమా విడుదలైన వారానికే పెట్టుబడి పెట్టిన ఈ సినిమాపై పెట్టిన పెట్టుబడి లాభాలను అందుకుంది. రెండోవారానికి హౌస్ ఫుల్స్‌తో బొమ్మ బద్దలు కొడుతుంది. అలానే హిందీలో విడుదలైన అంత కాశ్మీర్ ఫైల్స్ మొదట్లో కేవలం 50 షోలతో మొదలై ఏకంగా 3000 పైగా షోలతో నడుస్తుంది. ఈ చిన్న చిత్రం బడా హీరోల చిత్రంలో సైతం వెనక్కి నెట్టి ముందుకు వెళుతుంది. ఇంకా టాలీవుడ్ కార్తికేయ 2కి వస్తే ఈ చిత్రం కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది.