ప్రమోషన్ అనేది ఒక ప్రతీ ప్రభుత్వ ఉద్యోగి జీవితంలో ఒక మైలురాయి వంటిదని, ముఖ్యంగా పోలీసు మరింత బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని రాచకొండ సీపీ డిఎస్ చౌహాన్ ఐపిఎస్ అన్నారు.
రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇన్స్పెక్టర్ లుగా పనిచేస్తూ ఇటీవల ఏసిపిలుగా పదోన్నతులు పొందిన అధికారులు ఈ రోజు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ డి ఎస్ చౌహాన్ ఐపీఎస్ గారిని నెరెడ్ మెట్ లోని కమిషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన అధికారులను సీపీ అభినందించి కొన్ని సూచనలు చేశారు.
పోలీసుశాఖలో పనిచేస్తూ ఎన్నో ఏళ్ళుగా ప్రజా సంరక్షణ కోసం అవిశ్రాంతంగా చేసిన కృషికి ఈ పదోన్నతులు గొప్ప గుర్తింపు అన్నారు. ప్రమోషన్ అనేది ఒక మైలురాయి వంటిది అని, ఇక నుండి మరింత బాధ్యతావంతంగా విధులు నిర్వర్తిస్తూ పేరును కాపాడుకోవాలని, పోలీసు డిపార్ట్మెంట్ ప్రతిష్ట ను పెంపొందించే విధంగా పనిచేయాలని ఈ సందర్భంగా కమిషనర్ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రమోషన్ వచ్చిన వారు ఏసిపిలు లక్ష్మి , శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, నరేందర్ గౌడ్, జానకి రెడ్డి, నవీన్, నవీన్ రెడ్డి, ప్రకాష్ తో పాటు మిగతావారు పాల్గొన్నారు.