గత కొంతకాలంగా తనపై వస్తున్న పుకార్లకు నటుడు పృథ్వీరాజ్ చెక్ పెట్టారు. తన కంటే రెట్టింపు వయసు ఉన్న అమ్మాయిని ఆయన పెళ్లాడనున్నారు. 57 ఏళ్ల పృథ్వీ.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోనున్నారు. మొదటి భార్యతో జరిగిన గొడవల కారణంగా కొంతకాలంగా ఆమెకు దూరంగా ఉన్న పృథ్వీరాజ్.. శీతల్ అనే అమ్మాయితో గతకొన్ని రోజులుగా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న ప్రచారంపై ఓ ఇంటర్వ్యూలో పృథ్వీ స్పందించారు.
‘‘నా రెండో పెళ్లి గురించి కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. నేను రెండో పెళ్లి చేసుకున్నట్లు ఈ మధ్య జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో అందరికీ ఓ క్లారిటీ ఇవ్వాలి. రెండో పెళ్లి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదు. కానీ.. శీతల్ అనే అమ్మాయితో రిలేషన్‌షిప్‌లో ఉన్నాను. ఆమె వయసు 24 ఏళ్లు. నా మొదటి భార్యతో 6 ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి.
అందుకే నేను బయటకు వచ్చి వేరేగా ఉంటున్నాను. ఒంటరితనం మనిషిని కుంగదీస్తుంది. ఆ బాధ నేను కూడా పడ్డాను. అలాంటి సమయంలో శీతల్‌తో పరిచయం ఏర్పడి మంచి ఫ్రెండ్స్‌గా మారాం. త్వరలో ఆమెను పెళ్లి చేసుకుంటాను’’ అని పృథ్వీ తెలిపారు. ఇంట్లో వాళ్లందరికీ పృథ్వీ తెలుసని, పెళ్లికి వాళ్లందరూ అంగీకారం తెలిపారని అదే ఇంటర్వ్యూలో శీతల్ స్పష్టం చేశారు.