Quthbullapur MLA KP Vivekananda, Minister KTR, MLC Shambhipur Raju, Telangana News, Quthbullapur Constuency Development Works, Telugu World Now,
TELANGANA NEWS: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ సహకారం అందిస్తానని మంత్రి “కేటీఆర్” హామీ.
ఇటీవలే రోడ్లు, డ్రైనేజీ, నాలాల అభివృద్ధికి రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే….
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీ, నాలాల అభివృద్ధికి ఇటీవలే రూ.200 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసినందుకు గౌరవ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారిని ఈరోజు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు మరియు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు హైదరాబాద్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రి కేటీఆర్ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని రామ్ రెడ్డి నగర్ నుండి ఫాక్స్ సాగర్ మీదుగా కొంపల్లి NH-44 వరకు లింక్ రోడ్డు ఏర్పాటు, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని సూరారంలో గల లింగం చెరువును సుందరీకరించి, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అపర్ణ పామ్ గ్రోవ్స్ నుండి దూలపల్లి రోడ్డు వరకు అండర్ గ్రౌండ్ ఆర్‌సిసి పైపులైన్ తో వర్షపు నీటి నాలా నిర్మాణానికి రూ.2.62 కోట్ల నిధుల కేటాయింపు, హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మల్లంపేట్ గ్రామం వద్ద ఓఆర్ఆర్ 4&5 మధ్య ఎగ్జిట్, ఎంట్రీలు ఉండే విధంగా సదుపాయం కల్పించాలని, సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఉన్నటువంటి కెమికల్ నాలా బ్రిడ్జిని భవిష్యత్తులో ట్రాఫిక్ సమస్య లేకుండా వెడల్పు చేయాలని, ఫాక్స్ సాగర్ సుందరీకరణ, అదే విధంగా నియోజకవర్గంలోని పలు చోట్ల ఉన్న కెమికల్ నాలాల అభివృద్ధితో పాటు వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని యుద్ధప్రాతిపదికన నాలాల అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో పొందుపర్చారు. ఆయా విభాగాలకు చెందిన అధికారులతో చర్చించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రి కేటీఆర్ గారిని వారు కోరారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గారు స్పందిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చే దిశగా పని చేస్తూ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు గారు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు తన దృష్టికి తీసుకువచ్చిన పెండింగ్ అభివృద్ధి పనులను త్వరలోనే పూర్తయ్యేలా కృషి చేస్తానని, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి తన పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.