రాచకొండ పోలీస్ కమీషనరేట్ లోని పని చేస్తూ విధి నిర్వహణలో అనారోగ్యంతో చనిపోయిన జయెందర్, ఆర్మ్డ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఆర్మ్డ్ కానిస్టేబుళ్లు అంజయ్య, రోడ్ ప్రమాదంలో చనిపోయిన శేఖర్ కుటుంబ సభ్యులకు రాచకొండ సీపీ రాచకొండ సిపి మహేష్ భగవత్
చేతులమీదుగా భద్రత ఎక్స్ గ్రేషియా రూ. 7,98,320 లక్షలు చెక్కును జయేందర్ భార్యకు, 2 లక్షలు అంజయ్య భార్యకు, ముగ్గురు పిల్లలపై ఫిక్సెడ్ డిపాజిట్ 66,666/- ఒక్కొకరి పై మరియు శేఖర్ భార్య కు 5 లక్షల చెక్కు ను అంద చేయడం జరిగింది. అంజయ్య ముగ్గురు ఆడపిల్లల చదువు కొరకు ఈ సంవత్సరం స్కూల్ ఫీజ్ రాచకొండ సీపీ చెల్లిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాసులు, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రారెడ్డి, క్రిష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.