చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఈశ్వర్ నిర్మిస్తున్న చిత్రం ‘రాచరికం’. విజయ్ శంకర్ హీరోగా, అప్సరా రాణి హీరోయిన్‌గా రాబోతోన్న ఈ మూవీకి సురేష్ లంకలపల్లి కథ, కథనాన్ని అందిస్తు దర్శకత్వాన్ని వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత రాజ్ కందుకూరి క్లాప్ కొట్టగా.. నిర్మాత డీఎస్ రావు కెమెరా స్విస్ ఆన్ చేశారు. నిర్మాత ఈశ్వర్ స్క్రిప్ట్‌ను అందజేశారు. ఈ చిత్రానికి వెంగి సంగీతాన్ని అందించగా.. ఆర్య సాయి కృష్ణ కెమెరా మెన్ గా పని చేశారు. ఈ మూవీకి జేపీ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నటీనటులు : విజయ్ శంకర్, అప్సరా రాణి, విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
సాంకేతిక బృందం :
బ్యానర్ : చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : ఈశ్వర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : చాణక్య
కథ, స్క్రీన్, దర్శకత్వం : సురేష్ లంకలపల్లి
కెమెరామెన్ : ఆర్య సాయి కృష్ణ
సంగీతం : వెంగి
ఎడిటర్ : జేపీ
పీఆర్వో : సాయి సతీష్