Crime బాసర ట్రిపుల్ ఐటీ లో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపింది.. కనుమరుగు అయిపోయిందన్న ర్యాగింగ్ మళ్లీ మొదలై స్టూడెంట్ లను పక్క దోవ పట్టిస్తుంది.. జూనియర్స్ ను సీనియర్లు వేధిస్తున్నారంటూ అసిస్టెంట్ అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కాలం విద్యార్థులు ర్యాగింగ్ ఏదో ఫ్యాషన్ లో ఫీల్ అవుతున్నారు. జూనియర్లను ర్యాగింగ్ చేయడం గొప్ప విశేషం అనుకుంటూ ఆ మాయలో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు తాజాగా ఎలాంటి ఓ సంఘటన బాసర ట్రిపుల్ ఐటీ లో చోటు చేసుకుంది .బాసర ట్రిపుల్ ఐటీ లో కొంతకాలంగా ర్యాగింగ్ కలకలం రేపుతోంది. జూనియర్లో ప్రతినిత్యం సీనియర్లు వేధింపులకు గురవుతూనే ఉన్నారు అయితే ఈ విషయంలో ఎన్ని సార్లు సీనియర్లను మందలించిన లాభం లేకపోవడంతో అసిస్టెంట్ డీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కొంతకాలంగా క్యాంపస్‌లో ర్యాగింగ్ సాగుతున్నట్లుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.. అయితే దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.. దీంతో పోలీసులు ఐదుగురు సీనియర్ విద్యార్ధులపై కేసు నమోదు చేశారు.
ఈ మధ్య చాలా కాలంగా బాసర ట్రిపుల్ ఐటి ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది అక్కడ వసతులు సరిగ్గా లేవని భోజన సదుపాయం లేదని విద్యార్థుల ఆందోళనలు చేస్తూనే ఉన్నారు ఈ విషయం తెలంగాణ గవర్నమెంట్ వరకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే..అయితే మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పెద్దల హామీతో పిల్లలు నిరసనకు స్వస్తి పలికారు.