యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా గోవిందరాజు సమర్పణలో కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి ప్రొడక్షన్ నెంబర్ వన్ సినిమా ప్రారంభ పూజ ఈరోజు రామానాయుడు వీడియోస్ లో ఘనంగా జరిగింది. నూతన దర్శకుడు రమేష్ కడుములు ని పరిచయం చేస్తూ రాబోతున్న ఈ సినిమాని మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
ఈ సినిమా పూజ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ మారుతి, ప్రొడ్యూసర్ ఎస్. కె. ఎన్ , నక్కిన త్రినాధ రావు , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వివేక కూచిబొట్ల తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు డైరెక్టర్ మారుతి క్లాస్ చేయగా ప్రవీణ్ సత్తార్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. నక్కిని త్రినాధరావు ఫస్ట్ షార్ట్ డైరెక్ట్ చేయగా ధీరజ్ మొగిలినేని, వంశీ స్క్రిప్ట్ అందజేశారు.
ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. స్టార్ కంపోజర్ శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, ఆదిత్య జవ్వాడి డీవోపీగా పని చేస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్ కాగా, ‘బేబీ’ సురేష్ బీమగాని ఆర్ట్ డైరెక్టర్.
తారాగణం : రాజ్ తరుణ్, రాశి సింగ్
సాంకేతిక నిపుణులు :
బ్యానర్ : కనెక్ట్ మూవీస్ ఎల్.ఎల్. పి
రచన & దర్శకత్వం : రమేష్ కడుముల
ప్రొడ్యూసర్ : మురళీధర్ రెడ్డి, కేఐటిఎన్ శ్రీనివాస్
డిఓపి : ఆదిత్య జవ్వాడి
సంగీతం : శేఖర్ చంద్ర
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
ఆర్ట్ : బేబీ సురేష్ బీమగాని
వీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్ : సుధీర్