Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్‌తో ‘గేమ్ చేంజర్’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకోగా.. ఓ మూడు నెలల పాటు చరణ్ సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అయితే బ్రేక్ ఎందుకో అనేది మొదట చెప్పలేదు . నిజానికి
RRR తర్వాత రామ్ చరణ్ (Ram Charan) నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గేమ్ చేంజర్’ షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. డైరెక్టర్ శంకర్ (Shankar) సైతం కొన్ని రోజులుగా ‘ఇండియన్2’ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఆ షెడ్యూల్ కంప్లీట్ చేసిన ఆయన.. మే నెలలో ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ (Game Changer Climax) చిత్రీకరిస్తానని మంగళవారం ట్వీట్ చేశారు. ఈ షెడ్యూల్‌తో ‘గేమ్ చేంజర్’ షూటింగ్ పూర్తవనుండగా.. ఆ తర్వాత రామ్ చరణ్ మూడు నెలల పాటు బ్రేక్ తీసుకుంటారని సమాచారం. ఇంతకీ బ్రేక్ ఎందుకంటే?
రామ చరణ్ వైఫ్ ఉపాసన (Upasana) త్వరలోనే మొదటి బిడ్డకు (First Child) జన్మనివ్వబోతుంది. మే చివరన ఆమె డెలివరీ ఉన్నట్లు తెలుస్తుండగా.. ఆ తర్వాత కొన్ని నెలలు బ్రేక్ తీసుకోవాలని చరణ్ (Break to Movies) భావిస్తు్న్నట్లుగా సమాచారం. ఎందుకంటే తల్లీ బిడ్డతో తను కొద్ది రోజులు గడపాలనుకుంటున్నాడు. ఇక పుట్టబోయేది మొదటి బిడ్డ కాబట్టి తల్లిదండ్రులుగా చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నారు చరణ్, ఉపాసన. కాగా వీళ్లిద్దరూ ఇటీవలే దుబాయ్‌లో వెకేషన్ గడిపి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే, ‘గేమ్ చేంజర్’ క్లైమాక్స్ షూటింగ్‌ను వచ్చే వారం ప్రారంభించి మే ప్రారంభంలోగా కంప్లీట్ చేయాలని చరణ్ ప్లాన్ చేస్తు్నాడు. ఆ తర్వాత బ్రేక్ తీసుకోనుండగా.. బుచ్చిబాబుతో తన తదుపరి చిత్రం షూటింగ్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇలా చేయడం వల్ల అటు పర్సనల్ లైఫ్ లోనూ ఇటు ప్రొఫెషనల్ లైఫ్ లోనూ హ్యాపీ గా వుండవచ్చు అనే ప్లేన్ లో వున్నారు రామ్ చరణ్